బిట్ కాయిన్, షిబా ఇను పతనం, ఆ క్రిప్టో కరెన్సీ ఒక్కటే లాభాల్లో
బిట్‌కాయిన్ సహా వివిధ క్రిప్టోకరెన్సీలు నేడు క్షీణించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రిప్టోకరెన్సీ పైన పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ కాయిన్స్ ట్రాన్సాక్షన్స్, లాభాలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు వెల్లడించారు. క్రిప్టో ఇన్వెస్టర్లు దీనిని ముందుగానే అంచనా వేసినట్లుగా ఉంది. ఈ కారణంగా క్రిప్టో మార్కెట్ అంతగా పడిపోలేదు. క్రిప్టో కరెన్సీ నేడు 38 డాలర్లకు సమీపంలో ఉంది. వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ ఇలా ఉంది...
నేడు ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 2 శాతం క్షీణించి 37,758.84 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 715.38 బిలియన్ డాలర్లుగా ఉంది. 24 గంటల్లో 831 మిలియన్ డాలర్లు మారింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 68,990 డాలర్లు, 52 వారాల కనిష్టం 28,825 డాలర్లు, 52 వారాల గరిష్టం 68,990 డాలర్లు. 2022 క్యాలెండర్ ఏడాదిలో బిట్ కాయిన్ ఇన్వెస్టర్లు 17 శాతం మేర నష్టపోయారు.

ఇతర క్రిప్టోల విషయానికి వస్తే ఎథేరియం 2.73 శాతం క్షీణించి 2,687 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 0.89 శాతం క్షీణించి 0.615 డాలర్లు, సోలానా 1.64 శాతం తగ్గి 106.50 డాలర్ల వద్ద, టెర్రా 1.57 శాతం క్షీణించి 51.37 డాలర్ల వద్ద, కార్డానో 1.25 శాతం తగ్గి 1.05 డాలర్ల వద్ద, స్టెల్లార్ 1.57 శాతం క్షీణించి 0.198 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.99 శాతం తగ్గి 0.140 డాలర్ల వద్ద, యూనిస్వాప్ 4.32 డాలర్లు తగ్గి 10.78 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. పోల్కాడాట్ మాత్రం 0.40 శాతం ఎగిసి 19.66 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. షిబా ఇను 3.92 డాలర్లు క్షీణించి 0.000021 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications