For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8 ఏళ్లలో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 35% పతనం, ఎందుకంటే

|

అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్ కాయిన్ వ్యాల్యూ ఇటీవలి కాలంలో అంతకంతకూ పడిపోతోంది. 2010 జూలైలో 0.08 డాలర్లతో ప్రారంభమైన బిట్ కాయిన్ ప్రస్తానం గత నెలలో ఏకంగా 58,000 డాలర్లను క్రాస్ చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా 45వేల డాలర్లకు పడిపోయింది. బిట్ కాయిన్ వ్యాల్యూ పడిపోవడంతో క్రిప్టోకరెన్సీలో కూడా దీని మార్కెట్ క్యాప్ పడిపోతోంది. 2013 మే నెల నాటికి క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ మార్కెట్ వ్యాల్యూ 94 శాతంగా ఉంది. ఫిబ్రవరి 2017లో బిట్ కాయిన్ వాటా 86 శాతానికి పడిపోయింది. అదే సంవత్సరం జూన్ నెలకు 37 శాతం తగ్గింది. అయినప్పటికీ చాలామంది ఇన్వెస్టర్లు బిట్ కాయిన్ వైపు చూశారు.

బాగా నడవండి, చెప్పింది తినండి! 80%-100% వరకు ఆఫర్, వారు చెప్పింది చేస్తే ఆఫర్లుబాగా నడవండి, చెప్పింది తినండి! 80%-100% వరకు ఆఫర్, వారు చెప్పింది చేస్తే ఆఫర్లు

పోటీ ఎక్కువ.. పడిపోయిన బిట్ కాయిన్ మార్కెట్ వాటా

పోటీ ఎక్కువ.. పడిపోయిన బిట్ కాయిన్ మార్కెట్ వాటా

బిట్ కాయిన్ కొనుగోలు పెరగడంతో 2021 మార్చి 1వ తేదీ నాటికి మార్కెట్ వాటా 61.11 శాతంగా నమోదయింది. 2013 నాటికి బిట్ కాయిన్ మార్కెట్ వాటా 94 శాతంగా ఉంది. అంటే ఈ ఎనిమిదేళ్లలో బిట్ కాయిన్ దాదాపు 35 శాతం మార్కెట్ వాటాను కోల్పోయింది. బిట్ కాయిన్ వాటా పడిపోవడానికి ప్రధానంగా పోటీ డిజిటల్ కరెన్సీలు రావడమే. కొన్నేళ్లుగా కొత్త కొత్త డిజిటల్ కరెన్సీల మార్కెట్లోకి వస్తున్నాయి.

పెరుగుతున్న మార్కెట్ సైజ్

పెరుగుతున్న మార్కెట్ సైజ్

కొత్త కొత్త డిజిటల్ కరెన్సీలు వస్తుండటంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ సైజ్ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇన్వెస్టర్లు క్రిప్టో వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో భారీగా రిటర్న్స్ ఇచ్చిన వాటిలో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. అందుకే చాలామంది ఈ వైపు చూస్తున్నారు. అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ పెరుగుతున్నప్పటికీ కొత్త కరెన్సీ రాకతో బిట్ కాయిన్ వాటా కాస్త తగ్గింది. ఇప్పటికీ ఎక్కువ మంది బిట్ కాయిన్ వైపు చూస్తారు.

60 శాతం వరకు బిట్ కాయిన్

60 శాతం వరకు బిట్ కాయిన్

క్రిప్టో కరెన్సీ వైపు చూసే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌పోలియోలో 60 శాతం నుండి 70 శాతం వరకు బిట్ కాయిన్ పైన, మిగతా మొత్తం ప్రత్యామ్నాయ క్రిప్టో పైన ఇన్వెస్ట్ చేస్తున్నారని క్రిప్టో మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బిట్ కాయిన్, కార్డానో, బినాన్స్ కోయన్, టెథెర్, పోల్కాడోట్, లైఫ్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్ వంటి క్రిప్టో ఉన్నాయి.

English summary

8 ఏళ్లలో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 35% పతనం, ఎందుకంటే | Bitcoin’s share in global crypto market cap declined 35 per cent in 8 years

The largest cryptocurrency bitcoin, which started trading from around $0.08 per coin in July 2010, has gradually witnessed a decline in its share in the overall market cap of cryptocurrencies globally.
Story first published: Wednesday, March 3, 2021, 15:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X