క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మళ్ళీ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గత నెలలో ఓ సమయంలో 58,000 డాలర్లు దాటి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన బిట్ కాయిన్ ఆ తర్వాత 45వేల డాలర్ల దిగువకు పడిపోయింది. కొద్ది రోజుల తర్వాత తిరిగి పుంజుకోవడం ప్రారంభించింది. దీంతో బిట్ కాయిన్ గత నాలుగు రోజులుగా ఎగిసిపడుతోంది. న్యూయార్క్ మార్కెట్లో బిట్ కాయిన్ 57,000 డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టం దగ్గరకు వచ్చింది. ఓ సమయంలో 5.2 శాతం మేర లాభపడింది. ఫిబ్రవరి తర్వాత ఈ నెలలో మొదటిసారి బిట్‌కాయిన్ 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను దాటింది.
ఫిబ్రవరి నెలలో అమెరికాలో కన్స్యూమర్ ధరలు అంచనాల కంటే తక్కువ పెరిగాయి. బిట్ కాయిన్ ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీలో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎథెర్ రెండో స్థానంలో ఉంది. ఎథెర్ క్రిప్టో ఇటీవల 3 శాతం మేర పెరిగింది. బిట్ కాయిన్ (BTC), ఎథెరియమ్ (ETH)తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కార్డానో (ADA), పోల్కాడాట్ (DOT), XRP (XRP), యూనిస్వాప్ (UNI) కూడా సానుకూలంగా ఉన్నాయి.

టెస్లా ఇంక్‌తో పాటు ఏఆర్‌కే ఇన్నోవేషన్ ఈటీఎఫ్ వంటి సంస్థలు ఊతమివ్వడంతో బిట్ కాయిన్ తిరిగి పుంజుకుంటోంది. తాము 200 మిలియన్ డాలర్లను సమీకరించామని ఇటీవల బిట్ కాయిన్ సంబంధిత ఫైనాన్షియల్ సర్వీసెస్ NYDIG వెల్లడించింది. స్టోన్ రిడ్జ్ హోల్డింగ్స్ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, న్యూ యార్క్ లైఫ్, మాస్ మ్యుచువల్, సోరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ వంటి వాటి నుండి ఈ నిధులను సమీకరించింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications