క్రిప్టో కరెన్సీ పరుగులు పెడుతోంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేటి సెషన్‌లో 63,000 డాలర్లు క్రాస్ చేసింది. రెండో అతిపెద్ద దిగ్గజం ఎథేరియం 4600 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.59 బిలియన్ డాలర్లు పెరిగి 1.19 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎథేరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో 540 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇతర పాపులర్ క్రిప్టోలు ఎక్స్‌పీఆర్, కార్డానో, సోలానా, టెర్రా, పోల్కాడాట్, స్టెల్లార్, యూనిస్వాప్, పాలీగోన్, లైట్ కాయిన్ కూడా భారీగా లాభపడ్డాయి. అయితే మీమీ క్రిప్టో షిబా ఇను మాత్రం స్వల్పంగా నష్టపోయింది.
బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇటీవల 66వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 60వేల స్థాయికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ 64,000 డాలర్లకు చేరువైంది.

- Bitcoin - 63,418.67 డాలర్లు
- Ether - 4,610.14 డాలర్లు
- Dogecoin - 0.275553 డాలర్లు
- Litecoin - 207.12 డాలర్లు
- XRP - 1.21 డాలర్లు
- Cardano - 2.12 డాలర్లు


Click it and Unblock the Notifications