క్రిప్టోకరెన్సీ క్రేజ్ గత కొన్నిరోజులుగా ఉపందుకుంటూ వస్తుంది ముఖ్యంగా బిట్‌కాయిన్. ఒక విధంగా చెప్పాలంటే క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు చేస్తున్నారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ గత ట్రేడింగ్ సెషన్‌లో $94,078 వద్ద ముగిసి సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. coinmarketcap.com ప్రకారం $1.83 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో ఉదయం 10:10 AM నాటికి Bitcoin $92,355.44 వద్ద ట్రేడవుతోంది. కొద్దిరోజుల క్రితం బిట్‌కాయిన్ ఆల్ టైం హైకి చేరుకొని 90వేల డాలర్లను దాటింది.
బ్లాక్‌రాక్ iShares Bitcoin ట్రస్ట్ కోసం ఆప్షన్స్ ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టడం అండ్ క్రిప్టో ట్రేడింగ్ సంస్థ Bakkt కొనుగోలును అన్వేషిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మీడియా కంపెనీ చుట్టూ ఉన్న ఊహాగానాలతో సహా క్రిప్టోకరెన్సీ ఇంకా ఆర్థిక రంగాలలో కీలక పరిణామాలు ఈ కొత్త మైలురాయికి చేర్చాయి. మరోవైపు అమెరికాలో జరిగిన ఎన్నికల సందడి, క్రిప్టోకరెన్సీ పై ట్రంప్ సానుకూలత కూడా బిట్‌కాయిన్ ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకొవడాయికి తోడ్పడ్డాయి. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన సిల్వర్‌ను దాటేసి ఎనిమిదో అసెట్‌గా బిట్ కాయిన్ నిలిచింది.

బ్లాక్‌రాక్ iShares బిట్‌కాయిన్ ట్రస్ట్ కోసం అప్షన్స్ ట్రేడింగ్ పరిచయం అనేది క్రిప్టోకరెన్సీ మార్కెట్‌కు గేమ్-ఛేంజర్. దాని మొదటి ట్రేడింగ్ రోజున అప్షన్స్ $1.9 బిలియన్ల ట్రేడింగ్ వాల్యూమ్‌ను రికార్డ్ చేశాయి, ఇది బిట్‌కాయిన్ ధరల పెరుగుదలకు గణనీయంగా దోహదపడింది. Mudrex సహ వ్యవస్థాపకుడు అండ్ CEO ఎడుల్ పటేల్ మాట్లాడుతూ, "మొదటి బిట్‌కాయిన్ ఇటిఎఫ్ అప్షన్స్ ప్రారంభంతో బిట్‌కాయిన్ సరికొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $94,000కి చేరుకుంది. అయినప్పటికీ, గరిష్ట స్థాయిని అనుసరించి లాభాల స్వీకరణ BTCని ప్రస్తుత $92,000 స్థాయికి వెనక్కి తీసుకొచ్చింది. బిట్‌కాయిన్ ఇప్పుడు $94,600 వద్ద రిసిస్టన్స్ ఎదుర్కొంటుంది, సపోర్ట్ స్థిరంగా $90,400 వద్ద ఉంది అని ఆన్నారు.
దీనికి తోడు డోనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థ ప్రముఖ క్రిప్టో ట్రేడింగ్ సంస్థ Bakktను కొనేందుకు పరిశీలిస్తున్నట్లు కూడా నివేదికలు వెలువడ్డాయి. ఇది భవిష్యత్తులో క్రిప్టో-ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ గురించి పెట్టుబడిదారులలో ఆశావాదాన్ని రేకెత్తించింది. అమెరికా ఎన్నికల సమయంలో క్రిప్టోకరెన్సీ పై డోనాల్డ్ ట్రంప్ ప్రకటనల ద్వారా కూడా ఇన్వెస్టర్లలో ఆశలు పుట్టి పెట్టుబడులు భారీగా వచ్చాయి. మరోవైపు ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే బిట్ కాయిన్ విలువ రానున్న కాలంలో ఒక లక్ష డాలర్లకు కూడా చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications