క్రిప్టో మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. గత ఏడు రోజుల్లో బిట్ కాయిన్ ఏకంగా 32 శాతం లాభపడింది. మే నెల నుండి ఇంతలా లాభపడటం ఇదే మొదటిసారి. వరల్డ్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ బుధవారం ఏడు శాతం మేర లాభపడి 55,109 డాలర్లకు చేరుకుంది. గత 24 గంటల్లో క్రిప్టో మార్కెట్ లాభపడినప్పటికీ, కొన్ని మాత్రం స్వల్పంగా క్షీణించాయి. సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎథేరియం 1.5 శాతం మేర లాభపడి 3551 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కార్డానో, ఎక్స్‌పీఆర్, డోజీకాయిన్ ధరలు దాదాపు 9 శాతం మేర లాభపడ్డాయి. ఇక ిబా ఇను అయితే ఏకంగా 78 శాతం ఎగిసింది.
బిట్ కాయిన్ అక్టోబర్ 6వ తేదీన భారీగా లాభపడి 55,000 డాలర్లను తాకిందని, బిట్ కాయిన్ మద్దతు ధర 50,850 డాలర్లుగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. తర్వాత కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 50వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 50వేల డాలర్ల పైకి చేరుకుంది. 50వేల డాలర్ల నుండి మళ్లీ పడిపోయినప్పటికీ, గోడకు కొట్టిన బంతిలా మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు 55వేల డాలర్లు క్రాస్ చేసింది. మళ్లీ 51వేల స్థాయికి చేరుకున్నప్పటికీ, ప్రస్తుతం 54వేల డాలర్లకు సమీపంలో ఉంది.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ..
- Bitcoin - 51,371.50 - 3.70% వృద్ధి
- Ether - 3,454.37 - 1.77% వృద్ధి
- Dogecoin - 0.261910 - 11.28% వృద్ధి
- Litecoin - 171.42 - 1.90% వృద్ధి
- XRP - 1.06 - 0.23% వృద్ధి
- Cardano - 2.18 - 1.76% డౌన్


Click it and Unblock the Notifications