క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ దూసుకెళ్తోంది. గతవారం 50,000 డాలర్లని క్రాస్ చేసిన ఈ క్రిప్టో ఈ వారం ప్రారంభ సెషన్‌లోనే 52,000 డాలర్ల సమీపానికి చేరుకుంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకుంది. చాలా రోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. గత నెల రోజులుగా 40వేల డాలర్లు దాటి, ఇప్పుడు 50వేల డాలర్లకు చేరుకుంది. ఇటీవల గత కొద్ది సెషన్లుగా 46,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కనిపించి, ఇప్పుడు 52,000 డాలర్లకు అడుగు దూరంలో ఉంది. ఆ తర్వాత కాస్త క్షీణించినప్పటికీ మొత్తానికి లాభాల్లో ఉండటంతో పాటు 52,000 డాలర్లకు సమీపంలోనే ఉంది. బిట్ కాయిన్ గత 24 గంటల్లోనే 3.50 శాతం మేర లాభపడింది. గత ఏడు రోజుల కాలంలో ఇది 6.58 శాతం వృద్ధి నమోదు చేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 972.63 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్ వాటా 41.63 శాతంగా ఉంది. క్రితం సెషన్‌తో పోలిస్తే మార్కెట్ వాటా 0.29 శాతం పెరిగింది.
ప్రస్తుతం 51,000 మార్కు దాటిన బిట్ కాయిన్ త్వరలోనే 55,000 దిశగా కనిపిస్తోందని, తదుపరి సైకలాజికల్ నిరోధకస్థాయి 55,000 డాలర్లుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు బిట్ కాయిన్‌తోపాటు టాప్ 10 క్రిప్టోల్లో మిగతావి కూడా ఎక్కువగా లాభపడినట్లు చెబుతున్నారు. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 3,920.28 డాలర్లకు చేరుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 0.54 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత వారంరోజుల్లో 22.15 శాతం లాభపడింది. మార్కెట్ క్యాప్ 460.33 బిలియన్ డాలర్లుగా ఉంది.

మూడో అతిపెద్ద క్రిప్టో కార్డానో 2.89 డాలర్ల వద్దఉంది. వారం రోజుల్లో 1.08 శాతం లాభపడింది. బియాన్స్ కాయిన్ మూడు నుండి నాలుగో స్థానానికి పడిపోయింది. ఒకరోజులో 0.21 శాతం లాభపడి 98.47 డాలర్లకు చేరుకుంది. గత ఏడు రోజుల్లో 4.12 శాతంగా నమోదయింది.
ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
- Bitcoin BTC - $51,814.16 - 3.30 శాతం జంప్
- Ethereum ETH - $3,920.56 - 0.58 శాతం జంప్
- Cardano ADA - $2.89 - 0.86 శాతం జంప్
- Binance Coin BNB - $499.90 - 0.64 శాతం జంప్
- Tether USDT - $1.00 - 0.00 శాతం జంప్
- XRP - $1.33 - $5.10 శాతం జంప్
- Dogecoin - $0.31 - $4.35 శాతం జంప్
- Solana SOL - $140.81 - $1.87 శాతం డౌన్
- Polkadot DOT - $33.98 - 4.86 శాతం జంప్
- USD Coin USDC - $1.00 - 0.08 శాతం డౌన్
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications