40,000 మార్క్ దాటిన బిట్ కాయిన్, ఎథేర్ కూడా 6 శాతం వరకు అప్
క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయిన్ నేడు 40వేల డాలర్లను క్రాస్ చేసింది. ప్రపంచ అత్యంత పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. ఈ బిట్ కాయిన్ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారీగా పతనమైంది. ఓ సమయంలో 65000 డాలర్లను తాకిన బిట్ కాయిన్ ఇటీవల 29,000 డాలర్ల దిగువకు పడిపోయింది. అయితే ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సానుకూల వ్యాఖ్యల అనంతరం తిరిగి పుంజుకుంటోంది.
బిట్ కాయిన్ నేడు ప్రారంభ సెషన్‌లో 40,000 డాలర్లను దాటింది. అయితే ఆ తర్వాత స్వల్పంగా క్షీణించి ఈ మార్కు దిగువకు వచ్చింది. ప్రారంభంలో 0.51 శాతం ఎగబాకి 40,127.09 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇతర క్రిప్టో కరెన్సీ కూడా భారీగా ఎగిసింది.

Bitcoin - $40,127.09 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 0.51 ఎగిసింది.
Ethereum- $2426.73 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 5.77 శాతం ఎగిసింది.
Binance Coin - $321.62 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 2.66 శాతం ఎగిసింది.
Cardano - $1.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 1.92 శాతం ఎగిసింది.
Dogecoin - $0.2084 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 2.11 శాతం ఎగిసింది.
XRP - $0.7518 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 6.26 శాతం ఎగిసింది.
Polkadot - $15.38 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 6.21 శాతం లాభపడింది.
Bitcoin Cash - $539.71 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 6.45 శాతం లాభపడింది.
Solana - $32.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 16.84 శాతం ఎగిసింది.
Litecoin - $142.54 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 3.01 శాతం ఎగిసిపడింది.


Click it and Unblock the Notifications