66,000 డాలర్లను దాటి అదరగొట్టిన బిట్ కాయిన్, డోజీకాయిన్ భారీ నష్టం
బిట్ కాయిన్ సహా వివిధ క్రిప్టోలు ఇటీవల పరుగులు పెడుతున్నాయి. క్రిప్టో కింగ్‌గా పేరుగాంచిన బిట్ కాయిన్ నేడు రెండు శాతం మేర లాభపడింది. బిట్ కాయిన్ నేడు సరికొత్త రికార్డును అందుకుంది. గతంలో 65,000 డాలర్ల సమీపంలో ముగిసిన ఈ క్రిప్టో.. నేడు ఏకంగా 66,000 డాలర్లను దాటింది. నేటి సెషన్‌లో 66,694 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్‌కు ఇది సరికొత్త రికార్డ్. అదే సమయంలో డోజీకాయిన్ 4 శాతం మేర నష్టపోయింది. టాప్ 10 క్రిప్టో కరెన్సీల్లో ఆరు భారీగా లాభపడ్డాయి. నాలుగు మాత్రం క్షీణించాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 2.53 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ దాదాపు 10 శాతం క్షీణించింది.
ప్రస్తుతం బిట్ కాయిన్ 62వేల డాలర్లు దాటింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.47 లక్షలకు పైన. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇప్పుడు 66వేల డాలర్లు క్రాస్ చేసి మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో నిలిచింది.

నేటి సెషన్‌లో బిట్ కాయిన్ 2.05 శాతం, ఎథేరియం 0.44శాతం, టెథేర్ 0.07 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 0.39 శాతం, పోల్కాడాట్ 0.04 శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.05 శాతం లాభపడ్డాయి. బియాన్స్ కాయిన్ 1.93 శాతం, కార్డానో 1.93 శాతం, సోలానా 1.69 శాతం, డోజీకాయిన్ 3.71 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications