క్రిప్టో మార్కెట్ అదరగొడుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ మొదలు దాదాపు అన్ని కూడా నేడు (సోమవారం, 6) లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవలి వరకు 30,000 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతూ వస్తోన్న బిట్ కాయిన్ ఇప్పుడు 31,000 డాలర్లు క్రాస్ చేసింది. ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 1900 డాలర్లకు చేరువైంది. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను కూడా లాభాల్లోనే ఉన్నాయి.
బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటల్లో 29,749.58 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 31,730.15 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి 4.89 శాతం ఎగిసి 31,333 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గత ఇరవై నాలుగు గంటల్లో 597 డాలర్లు ఎగిసిపడింది. వివిధ క్రిప్టో వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ దాదాపు 5 శాతం లాభపడింది. ఎథేరియం 4.12 శాతం, బియాన్స్ కాయిన్ 2.01 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 1.30 శాతం, సోలానా 8.37 శాతం, కార్డానో 7.70 శాతం, క్రిప్టో డాట్ కామ్ 2.32 శాతం లాభపడ్డాయి. డోజీకాయిన్ 1.13 శాతం, షిబా ఇను 1.81 శాతం ఎగిశాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎథేరియం నేమ్ సిస్టం 14 శాతం, కర్వ్ డావ్ టోకెన్ 12 శాతం, ఈ క్యాష్ 11 శాతం, థేటా 9.60 శాతం, థోర్ చైన్ 9.51 శాతం, లూప్రింగ్ 9.5 శాతం, నియో 9.22 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఎల్రాండ్ 9 శాతం, న్యూసైఫర్ 5.16 శాతం, లూనా క్లాసిక్ 3 శాతం, వేవ్స్ 2 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications