క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఓవైపు క్రిప్టోకరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సందేహాలు వస్తున్న ఈ పరిస్థితుల్లో
కూడా క్రిప్టోకింగ్ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బిట్ కాయిన్ మొదటిసారి 61,000 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. కరోనా నేపథ్యంలో అమెరికా 1.9 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న ఆశావాహ అంచనాలు, బిట్ కాయిన్ వంటి కరెన్సీలకు ఊతమిచ్చాయి.

లక్ష డాలర్ల దిశగా
ఏడాది కాలంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 1,000 శాతం వరకు ఎగిసిపడింది. 2020 నాలుగో త్రైమాసికం చివరి నాటికి 29,000 డాలర్ల స్థాయిలో ఉన్న ఈ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ ఆ తర్వాత ఏకంగా 58,000 డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 45వేల దిగువకు పడిపోయినప్పటికి, తిరిగి పుంజుకుంది. తాజాగా కొత్త గరిష్టం 61,000 డాలర్లను తాకింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వంటి ఇన్వెస్టర్లు బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం, దీనికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి వివిధ కారణాలతో బిట్ కాయిన్ దూసుకెళ్తోంది. 2021 చివరి నాటికి బిట్ కాయిన్ వ్యాల్యూ 1,00,000 డాలర్లకు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగం
బిట్ కాయిన్ చారిత్రక గరిష్టాలను చేరుకుంటోందని, ఈ క్రిప్టోకరెన్సీ నియంత్రణ ఇప్పుడు ఆర్థిక పర్యవేక్షణ సంస్థలకు ఒక ముఖ్యమైన ప్రాధాన్యతగా మారాలని మార్కెట్ నిపుణులు అంటున్నారు. క్రిప్టోకరెన్సీ ఏకంగా 61,000 డాలర్లను క్రాస్ చేసిన నేపథ్యంలో డివేర్ గ్రూప్ సీఈవో, వ్యవస్థాపకులగు నిగేల్ గ్రీన్ మాట్లాడుతూ... అన్ని క్రిప్టో కరెన్సీల మాదిరిగా కావొచ్చు లేదా కాకపోవచ్చు కానీ బిట్ కాయిన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగంగా మారుతోందని చెప్పారు. చలామణీలోని బిట్ కాయిన్స్ వ్యాల్యూ ఇప్పుడు ఒక ట్రిలియన్ డాలర్లు క్రాస్ చేసిందని, ధరలు గత ఏడాదితో పోలిస్తే 890 శాతం పెరిగాయన్నారు.

డిమాండ్ పెరుగుతోంది
పెట్టుబడి దిగ్గజాలు, చెల్లింపు సంస్థలతో చాలా పెద్ద ఆర్థిక సంస్థలు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకి మద్దతిస్తున్నాయని, దీంతో రిటైల్ పెట్టుబడిదారుల నుండి ఆసక్తి కనబడుతోందని చెబుతున్నారు. మున్ముందు డిజిటల్ కరెన్సీ వైపు చూడటం పెరుగుతుందని, దీనికి డిమాండ్ క్రమంగా పెరుగుతుందని, అందుకే ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ ఈ క్రిప్టో నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications