50,000 డాలర్లను తాకిన బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ భారీ జంప్
క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ భారీగా లాభపడింది. గత నాలుగు వారాల్లో మొదటిసారి 50,000 మార్కును తాకింది. వరల్డ్ బిగ్గెస్ట్ క్రిప్టో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఓ సమయంలో 5 శాతం మేర లాభపడి 50,312ను తాకింది. వివిధ కారణాలతో గత నెలలో క్రిప్టో కరెన్సీ దారుణంగా పతనమైంది. సెప్టెంబర్ 21వ తేదీన 40,596 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోలు లాభపడుతున్నాయి. సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో ఎతేరియం 3 శాతం ఎగిసి 3,466 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డోజీకాయిన్, కార్డానో, ఎక్స్‌పీఆర్, లైట్ కాయిన్, యూనిస్వాప్ లాభపడ్డాయి. డోజీకాయిన్, బియాన్స్ కాయిన్ 12 శాతానికి పైగా లాభపడ్డాయి. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోడక్ట్స్, ఫండ్స్ వరుసగా ఏడో వారం రికార్డ్ ఇన్‌ఫ్లోను నమోదు చేశాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ 2 శాతం లాభపడి 2.16 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూ గత ఏడాది కాలంలో 641 శాతం వృద్ధిని నమోదు చేసింది.
బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 40వేల డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనమై, 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత 47వేల డాలర్లకు చేరుకొని, మళ్లీ 42వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. తిరిగి క్రమంగా కోలుకొని, మళ్లీ 50వేల మార్కును అందుకుంది.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ (భారత కరెన్సీలో)
- Bitcoin - రూ.37,09,989.39
- Ethereum - 2,54,914.61
- Tether - 77.2
- Cardano - 168
- Binance Coin - 32,219.97
- XRP - 78.9
- Polkadot - 2,368.02
- Dogecoin - 16.56


Click it and Unblock the Notifications