ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ శుక్రవారం (జూలై 1) వ్యాల్యూ 20,000 డాలర్లకు దిగువనే ఉంది. నేడు కాస్త లాభపడినప్పటికీ, ఈ మార్కును మాత్రం క్రాస్ చేయలేదు. ఓ సమయంలో 18,700 డాలర్ల కంటే కిందకు పడిపోయింది. నేడు దాదాపు అన్ని క్రిప్టోలు లాభాల్లోనే ఉన్నప్పటికీ, ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే మూడు నుండి నాలుగు రెట్లు క్షీణతతో ఉన్నాయి.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 1.50 శాతం ఎగిసి 19,374 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 18,630 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 20,836 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 369 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఇతర క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.3 శాతం, ఎథేరియం 3 శాతం, బియాన్స్ కాయిన్ 2.3 శాతం, సోలానా 1.5 శాతం, స్టెల్లార్ 2.8 శాతం, క్రిప్టో డాట్ కామ్ 2.16 శాతం, డోజీకాయిన్ 2.17 శాతం, ఎఫ్‌టీఎక్స్ టోకెన్ 5.22 శాతం లాభపడ్డాయి. మీమ్ కాయిన్ షిబా ఇను 3 శాతం మేర క్షీణించి 0.000010 వద్ద ట్రేడ్ అయింది.

నేడు భారీగా లాభపడిన క్రిప్టోల్లో ఐఎక్సెక్ ఆర్ఎల్‌సీ 49 శాతం, మూన్ రివర్ 22 శాతం, ఏఎంపీ 15 శాతం, బేసిక్ అటెన్షన్ 10.55 శాతం లాభపడ్డాయి. ఈ నాలుగు డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. నష్టపోయిన టాప్ క్రిప్టోల్లో టెర్రా యూఎస్డీ ఉంది. ఇది 17 శాతం క్షీణించింది. ఇక న్యూమెరై 28 శాతం పడిపోయింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications