3.47 శాతం క్షీణించిన బిట్ కాయిన్, వివిధ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ నేడు...
క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ వరుసగా రెండో రోజు క్షీణించింది. నేడు (జూన్ 17వ తేదీ) బిట్ కాయిన్ 3.47 శాతం క్షీణించి 38,623.52 వద్ద ట్రేడ్ అయింది. క్రిప్టోకరెన్సీ మార్కెట్ నుండి వరుసగా రెండో వారం ఔట్-ఫ్లో కనిపించింది. జూన్ 11వ తేదీతో ముగిసిన వారంలోక్రిప్టోకరెన్సీ ఔట్-ఫ్లో 21 మిలియన్ డాలర్లుగా నమోదయింది. క్రిప్టో మార్కెట్ ఇటీవల వరుసగా ఊగిసలాటలో ఉంది. నేడు బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో వ్యాల్యూ కూడా క్షీణించింది. వరల్డ్ సెకండ్ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథేరియం 4.63 శాతం క్షీణించి 2,409.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
బిట్ కాయిన్, ఎథేరియం సహా ఇతర అన్ని క్రిప్టోకరెన్సీలు ఏకీకరణ దిశగా సాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బిట్ కాయిన్ గతంలో 65వేల డాలర్ల సమీపానికి చేరుకుంది. ఆ తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ దెబ్బతో ఏకంగా 35వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఇప్పుడు తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. అయితే రెండు రోజులుగా క్రిప్టో వ్యాల్యూ పడిపోతోంది. గడిచిన 24 గంటల్లో వివిధ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ కింది విధంగా క్షీణించింది.

బిట్ కాయిన్ $38,824.74 - 3.21% శాతం క్షీణత
ఎథేరియం $2420.34 - 4.17% శాతం క్షీణత
బియాన్స్ కాయిన్ $354.36 - 4.28% శాతం క్షీణత
టెథేర్ $1 - 0.03% శాతం క్షీణత
కార్డానో $1.52 - 1.30% శాతం క్షీణత
డోజీకాయిన్ $0.3251 - 1.30% శాతం క్షీణత
XRP $0.8584 - 0.53% శాతం క్షీణత
పోల్కాడాట్ $23.53 -1.33% శాతం క్షీణత
USD కాయిన్ $1.00 - 0.00% శాతం క్షీణత
యునిస్వాప్ $22.45 - 6.15% శాతం క్షీణత


Click it and Unblock the Notifications