క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ నేడు పతనమైంది. ముఖ్యమైన క్రిప్టోలు అన్ని కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్టెల్లార్, షిబా ఇను మాత్రమే లాభాల్లో కనిపిస్తున్నాయి. బిట్ కాయిన్ ప్రారంభంలో స్వల్పంగా నష్టపోయినప్పటికీ, ఈ వార్త రాసే సమయానికి భారీగా పడిపోయింది. బిట్ కాయిన్ 3.16 శాతం క్షీణించి 42,268 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత 24 గంటల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ 801 డాలర్లు పడిపోయింది.
బిట్ కాయిన్ 52 వారాల లేదా ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 1,507.67 డాలర్ల మేర పడిపోయింది. ప్రపంచ రెండో క్రిప్టో దిగ్గజం ఎథేరియం ఓ సమయంలో 5000 డాలర్ల దిశగా పరుగు పెట్టింది. ఇప్పుడు 3000 డాలర్ల స్థాయిలో ఉంది. గత 24 గంటల్లో 2,989.16 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 3,188.41 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఇతర క్రిప్టో కరెన్సీల విషయానికి వస్తే....

బిట్ కాయిన్ 3.45 శాతం తగ్గి 42,171 డాలర్ల వద్ద, ఎథేరియం 2.29 శాతం తగ్గి 3008 డాలర్ల వద్ద, ఎక్స్‌పీఆర్ 0.76 శాతం తగ్గి 0.809 డాలర్ల వద్ద, సోలానా 1.58 శాతం తగ్గి 98.03 డాలర్ల వద్ద, టెర్రా 1.85 శాతం తగ్గి 55.33 డాలర్ల వద్ద, అవాలాంచె 1.50 శాతం తగ్గి 91.72 డాలర్ల వద్ద, కార్డానో 1.25 శాతం తగ్గి 1.06 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 2.42 శాతం తగ్గి 18.77 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 1.29 శాతం తగ్గి 0.145 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. స్టెల్లార్ మాత్రం 0.29 శాతం ఎగిసి 0.215 డాలర్ల వద్ద, షిబా ఇను 0.51 శాతం పెరిగి 0.000031 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications