బిట్ కాయిన్ భారీ జంప్, నెలల తర్వాత 50,000 మార్క్ క్రాస్
క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు (సెప్టెంబర్ 2) 50,000 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. కార్డానో, ఎథేరియం, డోజీకాయిన్ వంటి వివిధ క్రిప్టో కరెన్సీలు పది శాతం వరకు ఎగిసిపడ్డాయి. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైం గరిష్టం 65,000 డాలర్లకు చేరుకుంది. కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇటీవల కోలుకుంటోంది. చాలా రోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. గత నెలలో 40వేల డాలర్లు దాటి, ఇటీవలే 50వేల డాలర్లకు చేరుకుంది. ఇటీవల గత కొద్ది సెషన్లుగా 46,000 డాలర్ల నుండి 48,000 డాలర్ల పైన ఉంటోంది. నేడు మళ్లీ 50,000 డాలర్లను తాకింది. సాయంత్రం సెషన్‌లో ఈ మార్కుకు సమీపంలో 49,690 డాలర్లకు పైగా ట్రేడ్ అయింది.
క్రిప్టో మార్కెట్ క్యాప్ 2.22 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది. క్రితం సెషన్‌తో పోలిస్తే ఏడు శాతం లాభపడింది. మరోవైపు క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ స్వల్పంగా పెరిగి 127.72 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అమెరికా విభాగం మరో మూడేళ్లలో ఐపీవోకు రావొచ్చునని గ్లోబల్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బియాన్స్ ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చాంగ్‌పెంగ్ జాహో అన్నారు. క్రిప్టో కరెన్సీలు నేడు అదరగొట్టాయి. బిట్ కాయిన్ 50,000 మార్కు దాటగా, రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం 3700 మార్కును దాటింది. బిట్ కాయిన్ జూన్ నెలలో 28,000 డాలర్ల కనిష్టాన్ని తాకింది. ఏప్రిల్ నెలలో 65,000 డాలర్లను తాకింది.

ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
- Bitcoin BTC - $49,603.56 - 5.49 శాతం జంప్
- Ethereum ETH - $3,766.13 - 9.64 శాతం జంప్
- Binance Coin BNB - $493.61 - 6.61 శాతం జంప్
- Tether USDT - $1.00 - 0.02 శాతం డౌన్
- Cardano ADA - $3.04 - 10.02 శాతం జంప్
- Dogecoin - 0.30 - 9.62 శాతం జంప్
- XRP - $1.25 - 5.89 శాతం జంప్
- Polkadot DOT - $32.19 - 7.19 శాతం జంప్
- USD Coin USDC - $0.99 - 0.04 శాతం డౌన్
- Solana SOL - 113.88 - 2.72 శాతం జంప్


Click it and Unblock the Notifications