బిట్ కాయిన్ భారీగా పతనం, రూ.2 లక్షలకు పైగా పతనమైన క్రిప్టో
క్రిప్టో కరెన్సీ నేడు ఒక్కరోజులోనే భారీగా పతనమైంది. పలు పాపులర్ డిజిటల్ టోకెన్లు ఇటీవలి గరిష్టాల నుండి ఏకంగా పది శాతానికి పైగా క్షీణించాయి. డాలర్ బలపడిన నేపథ్యంలో బిట్ కాయిన్ సహా పలు క్రిప్టోలు పతనమయ్యాయి. బిట్ కాయిన్ నేడు ఓ సమయంలో 59,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ 60,000 డాలర్ల పైన ట్రేడ్ అయింది. ప్రముఖ క్రిప్టోల్లో సోమవారం సెషన్ చివరి నుండి సెల్ఆఫ్ ప్రారంభమైంది. ఇది మంగళవారం కూడా కొనసాగింది. డిజిటల్ అసెట్ ఫిబ్రవరి నుండి మొదటిసారి 8 శాతానికి పైగా నష్టపోయింది. ఎథేరియం వరుసగా ఐదో రోజు నష్టపోయింది. నేడు మరో 5 శాతం నష్టపోయి 4300 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇటీవలి ఆల్ టైమ్ గరిష్టం నుండి ఇది 12 శాతం పతనం. గతవారం బిట్ కాయిన్ 68,525.84 డాలర్ల వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.
వరల్డ్ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ నేడు ఉదయం సమయానికి 7 శాతం పతనమై 61,000 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.15 ట్రిలియన్ డాలర్లుగా, ట్రేడింగ్ వ్యాల్యూమ్ 1.67 బిలియన్లుగా ఉంది. క్రితం సెషన్‌తో పోలిస్తే బిట్ కాయిన్ 5000 డాలర్ల వరకు కూడా పడిపోయింది. అయితే ఈ వార్త రాసే సమయానికి 3000 డాలర్ల మేర నష్టపోయి 60,866.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మన కరెన్సీలో రూ.2.20 లక్షలు క్షీణించి రూ.45,31,550.49 వద్ద ట్రేడ్ అయింది. ఎథేరియం భారీ కరెక్షన్‌కు గురయింది. గత 24 గంటల్లో 7.88 శాతం క్షీణించి 4,340 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏథేరియం మార్కెట్ క్యాప్ నేడు 509 బిలియన్ డాలర్లు క్షీణించి 1.47 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

- Bitcoin - 61,251.92 - 7.01% క్షీణత - మార్కెట్ క్యాప్
$1.16 trillion
- Ether - 4,355.83 - 7.46% క్షీణత - మార్కెట్ క్యాప్
$511.62 billion
- Dogecoin - 0.248589 - 5.79% క్షీణత - మార్కెట్ క్యాప్
$32.81 billion
- Litecoin - 247.35 - 10.94% క్షీణత - మార్కెట్ క్యాప్
$17.06 billion
- XRP - 1.13 - 6.87% క్షీణత - మార్కెట్ క్యాప్
$112.90 billion
- Cardano - 1.95 - 5.23% క్షీణత - మార్కెట్ క్యాప్
$64.07 billion


Click it and Unblock the Notifications