ఫిబ్రవరి తర్వాత బిట్‌కాయిన్ మొదటిసారి దారుణ పతనం
ఇటీవలి వరకు భారీగా ఎగిసిపడిన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ దారుణంగా పతనమైంది. ఫిబ్రవరి తర్వాత ఇంట్రాడేలో మొదటిసారి బిట్ కాయిన్ భారీగా క్షీణించింది. గత నెలలో 61వేల డాలర్లను క్రాస్ చేసిన ఈ క్రిప్టో కరెన్సీ, ఈ నెలలోనే 64వేల డాలర్లను దాటి మరో రికార్డ్ సృష్టించింది. అయితే టర్కీ క్రిప్టో కరెన్సీ నిర్ణయం అనంతరం బిట్ కాయిన్ పడిపోయింది. నిన్న నాలుగు శాతం మేరకు పడిపోయింది. ఆ తర్వాత 8.5 శాతం క్షీణించి 55,689.98 డాలర్లకు పడిపోయింది.

బిట్ కాయిన్ వ్యాల్యూ
బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకుముందు ఓ సమయంలో ఏకంగా 15.1 శాతం క్షీణించి 51,707.51 డాలర్లకు పడిపోయింది. సెకండ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎథేరియం 8 శాతం మేర పతనమైంది. బిట్ కాయిన్ వ్యాల్యూ కరోనా కాలంలో 800 శాతానికి పైగా లాభపడింది. ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా భారీగానే లాభపడ్డాయి. పలువురు ఇన్వెస్టర్లు క్రిప్టోకరెన్సీని మరో బంగారంగా చెబుతున్నారు.

1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్
క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్‌బేస్ గ్లోబల్ ఇంక్ నాస్‌డాక్‌లో లిస్టింగ్ అయింది. బిట్ కాయిన్ గతవారం ఏకంగా 64వేల డాలర్లను దాటింది. ఒరిజినల్, బిగ్గెస్ట్ క్రిప్టో కాయిన్ బిట్ కాయిన్ ఏడాది కాలంలో ఎనిమిది వందల శాతం ఎగిసి 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను క్రాస్ చేసింది. అయితే ఇప్పుడు 60వేల డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం.

ఆ తర్వాత డబుల్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఇంక్ ఈ బిట్ కాయిన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత వీసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు వివిధ క్రిప్టోకరెన్సీలకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాయి. దీంతో ఈ ఏడాది క్రిప్టోకరెన్సీ ఏకంగా రెండింతల వరకు పెరిగింది.


Click it and Unblock the Notifications