క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ దారుణంగా పతనమైంది. ఏకంగా 50వేల డాలర్ల దిగువకు వచ్చింది. శుక్రవారం ఓ దశలో 8 శాతం క్షీణించి 48,687 డాలర్లకు పడిపోయిన బిట్ కాయిన్, ఇటీవలి ఆల్ టైమ్ గరిష్టం 64 వేల డాలర్లతో పోలిస్తే 16వేల డాలర్ల వరకు పడిపోయింది. అమెరికా అధ్యక్షులు జో బిడెన్ సంపన్నులపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను దాదాపు రెట్టింపు స్థాయి 43.4 శాతానికి పెంచవచ్చుననే ఊహాగానాలతో క్రిప్టోకరెన్సీపై ఒత్తిడిని పెంచాయి. దీంతో బిట్ కాయిన్ 48 రోజుల కనిష్ఠస్థాయికి చేరింది.
మార్చి తొలి వారం తర్వాత బిట్ కాయిన్ 50వేల డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. గత ఎనిమిది రోజుల్లో బిట్ కాయిన్ ఏడుసార్లు నష్టాల్లోనే ముగిసింది. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు ఎథేరియం,, ఎక్స్‌ఆర్పీ వంటివి కూడా నేలచూపులు చూశాయి. దీంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజులో 20,000 కోట్ల డాలర్లకు (రూ.15 లక్షల కోట్లు) పైగా పతనమైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిట్‌కాయిన్ వ్యాల్యూ 75 శాతం పెరిగింది.

గత ఏడాదికాలంలో 575 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 2019 ఏప్రిల్ నెలతో పోలిస్తే 800 శాతం ఎగబాకింది. అంతకుముందు టర్కీ రద్దు ప్రభావం పడింది. ఇప్పుడు అమెరికా ప్రభావంతో భారీగా పతనమైంది. ఏకంగా 50వేల డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. అయితే చివరకు 50 వేల డాలర్లకు కాస్త పైన ట్రేడ్ అయింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications