బిట్ కాయిన్ మళ్లీ పతనం, ఎథేరియం అదే బాటలో.. కాస్త కోలుకున్నప్పటికీ...
క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ శనివారం దారుణంగా పతనమైంది. గత నెలలో ఆల్ టైమ్ గరిష్టం 65వేల డాలర్లకు చేరుకున్న ఈ క్రిప్టో ఆ తర్వాత 40వేల డాలర్ల దిగువకు వచ్చింది. అంతలోనే మళ్లీ పైపైకి చేరుకున్నట్లు కనిపించినప్పటికీ చివరి రెండు సెషన్‌లలో మళ్లీ దిగజారింది. ఓ సమయంలో ఏకంగా 5.16 శాతం పడిపోయి 33,849 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 36,056 డాలర్ల వద్ద ఉంది. సెకండ్ క్రిప్టో దిగ్గజం ఎథేరియం ఏకంగా 1900 డాలర్ల దిగువకు వచ్చింది. ఇది 1842 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 2400 డాలర్ల పైన ట్రేడ్ అయింది.

దాదాపు సగం పతనం
క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ కొద్ది రోజుల్లోనే దాదాపు సగం పతనమైంది. ఏప్రిల్ 14వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం 64,895.22 పలుకగా, ఇప్పుడు 36వేల డాలర్ల వద్ద ఉంది. ఈ కొద్ది కాలంలోనే 47 శాతం వరకు పడిపోయింది. గత వారం ఆస్థిరంగా ఉన్నప్పటికీ, మొత్తానికి ఈ నెల రోజుల్లోనే 38 శాతం పతనమైంది. క్రిప్టో కరెన్సీపై వివిధ దేశాల్లో రెగ్యులేటరీ ఒత్తిళ్ల నేపథ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం, డోజీకాయిన్ అన్నీ పతనమవుతున్నాయి. ప్రస్తుతం బిట్ కాయిన్ జనవరి కనిష్టానికి చేరుకున్నది. అలాగే ఆల్ టైమ్ కనిష్టంతో పోలిస్తే దాదాపు సగం వద్ద ట్రేడ్ అయి, కాస్త కోలుకొని 33 శాతం పతనంతో ఉంది.

అక్రమ బిట్ కాయిన్ మైనింగ్
సెంట్రల్ ఇంగ్లాండులోని ఓ ప్రాంతంలో బయటకు గంజాయి ఫాంగా కనిపించినప్పటికీ, అక్కడ పోలీసులు తనిఖీ చేయగా బిట్ కాయిన్ మైనిగ్ జరుగుతున్నట్లు తేలింది. గంజాయి ఫాంగా భావించిన డ్రగ్స్ పోలీసులు అక్కడకు వెళ్లగా విస్తృతంగా వైరింగ్, వెంటిలేషన్ డక్ట్స్ ఏర్పాటయ్యాయి. వేడి జనరేట్ అవుతోంది. పోలీసులు చెక్ చేయగా నేషనల్ గ్రిడ్ నుండి భారీగా విద్యుత్ దొంగిలిస్తోన్న విషయం బయటపడింది. బర్మింగ్‌హాంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుండి అక్రమంగా బిట్ కాయిన్ మైనింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ ఇది రెండో క్రిప్టో మైనింగ్ అని భావిస్తున్నారు.

క్రిప్టో మైనింగ్ నిషేధం
ఈ ఫాంలో 100 కంప్యూటర్లు, ఎలక్ట్రిసిటీ మీటర్లు అనుసంధానం చేశారు. ఈ ఫాం యజమానిని పోలీసులు విచారిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ మైనింగ్ కోసం భారీ మొత్తంలో ఇంధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ నాలుగు నెలల పాటు అన్ని రకాల క్రిప్టో కరెన్సీల మైనింగ్‌ను నిషేధించింది.


Click it and Unblock the Notifications