క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉంది. గత నెలలో బిట్ కాయిన్ 61 వేల డాలర్లను క్రాస్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 60వేల డాలర్లను దాటి జీవనకాల గరిష్టానికి దగ్గరగా ఉంది. అతిపెద్ద అమెరికా క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ లిస్టింగ్‌కు ఉంది. సోమవారం ఓ సమయంలో 2.6 శాతం ఎగిసి 61,229 డాలర్లను తాకింది. మార్చి 13వ తేదీన 61,742 డాలర్లు పలికింది. గత ఏడాది కాలంలో బిట్ కాయిన్ దాదాపు 9 రెట్లు ఎగిసింది.ఈక్విటీస్, బులియన్ మార్కెట్ కంటే అధిక రిటర్న్స్ ఇచ్చింది.

బిట్ కాయిన్ జంప్
డిజిటల్ టోకెన్ ఎక్స్చేంజ్ కాయిన్‌బేస్ ఇంక్ ఏప్రిల్ 14న నాస్‌డాక్ లిస్టింగ్‌కు ఉంది. ప్రధాన క్రిప్టోకరెన్సీ కంపెనీ లిస్టింగ్‌కు రావడం ఇదే మొదటిసారి. నాస్‌డాక్‌లో లిస్టింగ్‌కు సిద్ధమైన నేపథ్యంలో కాయిన్‌బేస్ డిజిటల్ కరెన్సీ పాజిటివ్‌గా ఉందని క్రిప్టో లెండర్ నెక్సో కో-ఫౌండర్ ఆంటోనీ ట్రెచ్చీ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుండి బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీలకు గోల్డ్‌మెన్ శాక్స్ పచ్చజెండా ఊపింది. వివిధ సంస్థలు క్రిప్టోకరెన్సీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కలిసి వచ్చింది.

బంగారం కంటే మంచి రిటర్న్స్
బిట్ కాయిన్ వోలాటిలిటీని ఇటీవల జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కంపెనీ స్ట్రాటెజిస్ట్ ఇటీవలి నివేదికలో ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా సూచీలు పతనమైనప్పటికీ, బంగారం మంచి రిటర్న్స్ ఇచ్చింది. అదే సమయంలో కరోనా కేసులు తగ్గాక మళ్ళీ పసిడి ధరలు క్షీణించాయి. బిట్ కాయిన్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా అలాగే ఉన్నప్పటికీ బంగారంతో పోలిస్తే అధిక రిటర్న్స్ అందించింది. ఇప్పటికీ ఇది ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉంది. ఇటీవలి కాలంలో బంగారం 40 శాతం వరకు పెరిగి, మళ్లీ కొంత తగ్గింది. కానీ బిట్ కాయిన్ వంటి క్రిప్టో 9 రెట్లు ఎగిసింది.

అదిరిపోయే రిటర్న్స్
రెండో స్థానంలో ఉన్న ఎథేర్ క్రిప్టోకరెన్సీ కూడా రోజురోజుకు ఎగుస్తోంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ భారీగా ఎగిసింది. 6600 కంటే ఎక్కువ కాయిన్స్ కలిగిన వీటి మార్కెట్ వ్యాల్యూ 2 ట్రిలియన్ డాలర్లు దాటింది. బిట్ కాయిన్, ఎథేరియం వంటి వివిధ క్రిప్టోకరెన్సీలు ఇటీవలి కాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications