For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ నిషేధంపై నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే!

|

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌ను నిషేధించకపోవచ్చునని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మల క్రిప్టోకరెన్సీపై స్పందించారు. ప్రభుత్వం బిట్ కాయిన్, ఇతర కరెన్సీలను బ్యాన్ చేయకపోవచ్చునని చెబుతున్నారు. క్రిప్టో ప్రపంచంలోని అన్ని రకాల ప్రయోగాలకు ఓ విండో అందుబాటులో ఉందని తాము నిర్ధారించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. వేటిని కూడా కలిగి ఉండబోము అని తాము చెప్పడం లేదన్నారు. తద్వారా నిషేధం ఉండదని అభిప్రాయపడ్డారు.

క్రిప్టో బిట్ కాయిన్ వ్యాల్యూ ఆదివారం 4.18 శాతం ఎగిసి 50,947 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే నేడు 2,043 డాలర్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి 4వ తేదీన 27,734 డాలర్ల వద్ద ఉన్న ప్రపంచ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఈ కాలంలో 83.7 శాతం లాభపడి 58,354.14 డాలర్లకు ఎగిసింది. ఆ తర్వాత గత కొన్ని సెషన్లుగా ఈ క్రిప్టో వ్యాల్యూ అంతకంతకూ పడిపోయింది.

Bitcoin Might Not Be Banned in India: FM Nirmala

బిట్ కాయిన్ వ్యాల్యూ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బిట్ కాయిన్ వ్యాల్యూ ఆల్ టైమ్ గరిష్టం 58,000 నుండి ఓ సమయంలో 37 శాతం క్షీణించింది. తిరిగి మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు 50వేల డాలర్లు క్రాస్ చేసింది. బిట్ కాయిన్ కొనుగోలు పెరగడంతో 2021 మార్చి 1వ తేదీ నాటికి దీని మార్కెట్ వాటా 61.11 శాతంగా నమోదయింది.

English summary

బిట్ కాయిన్ నిషేధంపై నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే! | Bitcoin Might Not Be Banned in India: FM Nirmala

Cryptocurrency traders in India have something positive to look forward to after Finance Minister Nirmala Sitharaman said that the government might not ban bitcoin and other cryptocurrencies.
Story first published: Monday, March 8, 2021, 15:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X