ఎలాన్ మస్క్ ట్వీట్, 40,000 డాలర్ల దిశగా బిట్ కాయిన్
క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ వ్యాల్యూ 39,000 డాలర్ల మార్కును దాటింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ అనంతరం క్రిప్టో జంప్ చేసింది. మరింత క్లీన్ ఎనర్జీతో మైనింగ్ చేస్తే క్రిప్టోకరెన్సీని యాక్సెప్ట్ చేస్తామని ఈ ఎలక్ట్రిక్ కార్ మేకర్ అధినేత వెల్లడించారు. దీంతో సోమవారం ఉదయం బిట్ కాయిన్ వ్యాల్యూ 39,210 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ దాదాపు 10 శాతం పెరిగింది. జూన్ 9వ తేదీ తర్వాత క్రిప్టోకరెన్సీ ఒకరోజు ఇంత శాతం పెరగడం ఇదే మొదటిసారి.
క్రిప్టోకరెన్సీలు బిట్ కాయిన్, ఎథేరియం పోల్కాడాట్ వంటి ధరలు నేడు ఇలా ఉన్నాయి. బిట్ కాయిన్ గత 24 గంటల్లో 9.51 శాతం ఎగిసి 39,011.85 డాలర్లు పలికింది. ఎథేరియం ధర 4.11 శాతం లాభపడి 2,498.77 డాలర్ల వద్ద, టెథెర్ వ్యాల్యూ 0.10 శాతం పెరిగి 1.00 డాలర్ల వద్ద, బియాన్స్ కాయిన్ వ్యాల్యూ 5.32 శాతం ఎగిసి 364.83 డాలర్ల వద్ద, కార్డానో వ్యాల్యూ 4.52 శాతం పెరిగి 1.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

డోజీకాయిన్ వ్యాల్యూ 3.17 శాతం ఎగిసి 364.83 డాలర్ల వద్ద, XRP క్రిప్టో వ్యాల్యూ 4.88 శాతం ఎగిసి 0.8786 డాలర్ల వద్ద, కాయిన్ యూఎస్డీసీ వ్యాల్యూ 0.11 శాతం ఎగిసి 1 డాలర్ వద్ద, పోల్కాడాట్ డాట్ 4.71 శాతం ఎగిసి 21.96 డాలర్ల వద్ద, యునిస్వాప్ 6.21 శాతం లాభపడి 22.92 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications