బిట్‌కాయిన్ తాజాగా $100 డాలర్లను తాకిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు బిట్‌కాయిన్ ప్రయాణం మాత్రం ఎవరు ఊహించని విధంగా మారింది. కానీ ఒకప్పుడు బిట్‌కాయిన్ ద్వారా పిజ్జా కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బిట్‌కాయిన్ ఉన్న ప్రతి ఒక్కరు అదృష్టవంతులు అని చెప్పవచ్చు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత బిట్‌కాయిన్ ధర కూడా గణనీయంగా పెరిగింది. గత 13 ఏళ్లుగా బిట్‌కాయిన్ ఇచ్చిన రిటర్న్‌లు చూస్తే ఎవరికైనా కళ్లు తెల్లబడాల్సిందే. 2011లో ఎవరైనా బిట్‌కాయిన్‌లో కేవలం రూ.100 పెట్టుబడి పెట్టుబడి పెట్టి ఉంటె అతను ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యుండేవాడు. ఎందుకంటే అతని రూ.100 పెట్టుబడి ఇప్పుడు రూ.1.65 కోట్లుగా మారేది.

అయితే 2009లో బిట్‌కాయిన్‌ను ప్రారంభించారు, అప్పుడు దాని ప్రారంభ ధర సున్నా. 2024 నాటికి దీని ధర దాదాపు కోటి రూపాయలకు చేరుకుంది. నవంబర్ 24న బిట్ కాయిన్ ధర 97,654.9 డాలర్లు (దాదాపు రూ. 82.43 లక్షలు). బిట్‌కాయిన్ ప్రయాణం అద్భుతమైనది మాత్రమే కాదు షాకింగ్ కూడా.
రూ.100కి 2.22 బిట్‌కాయిన్‌లు
2011లో బిట్‌కాయిన్ విలువ కేవలం $1 డాలర్ మాత్రమే అంటే రూ.45.50. ఆ సమయంలో మీరు 100 రూపాయలకు 2.22 బిట్‌కాయిన్‌లను కొనొచ్చు. ఒక బిట్‌కాయిన్ ఇప్పుడు $97,654.9 డాలర్లకి చేరింది. అంటే 13 ఏళ్ల క్రితం కొన్న 2.22 బిట్ కాయిన్ల ధర ఇప్పుడు రూ.1.65 కోట్లు. అంటే బిట్‌కాయిన్‌లో రూ.100 ఇన్వెస్ట్ చేసే వ్యక్తి నేడు కోటీశ్వరుడు అయ్యుండేవాడు.
2020లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా లాక్ డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఈ కాలంలోనే బిట్‌కాయిన్ వృద్ధి చెందడం కనిపించింది. అదే సంవత్సరం ప్రారంభంలో బిట్‌కాయిన్ ధర $7,100 చివరి నాటికి $29,000కి చేరుకుంది. అంటే దాదాపు 400% భారీ పెరిగింది. చివరికి 2021లో బిట్‌కాయిన్ కొత్త రికార్డులను నెలకొల్పి $40,000కి చేరుకుంది. ఏప్రిల్ నాటికి $60,000 మార్కును దాటి 2022, 2023లో క్షీణించడం ప్రారంభించింది. 2022 చివరిలో $20,000 దిగువకు పడిపోయింది ఇంకా 2023 ప్రారంభంలో $16,530కి పడిపోయింది.
డొనాల్డ్ ట్రంప్ విజయం ఇచ్చిన బూస్ట్
బిట్‌కాయిన్ తాజా పెరుగుదల రహస్యం అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీలు. అమెరికాను "బిట్‌కాయిన్ అండ్ క్రిప్టోకరెన్సీ రాజధాని"గా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ క్రిప్టో మార్కెట్లో పెట్టుబడిదారుల అంచనాలను పెంచింది. ఎన్నికల తర్వాత బిట్‌కాయిన్ ధర దాదాపు ఏకంగా 40% పెరిగింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications