బిట్ కాయిన్ కంటే రిటర్న్స్ ఎక్కువగా ఇచ్చిన క్రిప్టో ఇదే
ప్రపంచ దిగ్గజ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ 58,000 డాలర్ల పైనే ఉంది. ఇటీవల సెషన్‌లలో కాస్త క్షీణించినప్పటికీ ఈ మార్కు పైనే ట్రేడ్ అవుతోంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పైన గందరగోళం నేపథ్యంలో బిట్ కాయిన్ ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. గత 24 గంటల కాలంలో ఈ క్రిప్టో కరెన్సీ 56,242.80-58,608.83 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. సాయంత్రం సెషన్లో 58,125.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం 61,711.87 డాలర్లతో 6 శాతం క్షీణించింది.
ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథేరియమ్ తన ఆల్ టైమ్ గరిష్టం 2,042 డాలర్ల నుండి ఇప్పటికీ 12 శాతం తక్కువగా ఉంది. గత ఏడాది కాలంలో ఎథెరియమ్ క్రిప్టోకరెన్సీ మార్జిన్ రిటర్న్స్ పరంగా బిట్ కాయిన్‌ను దాటవేసింది. ఈ కాలంలో బిట్ కాయిన్ 800 శాతం ఎగిసిపడగా, ఎథేరియమ్ 1200 శాతం జంప్ చేసింది.

ఏడాది కాలంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 8,000 శాతం వరకు ఎగిసిపడింది. 2020 నాలుగో త్రైమాసికం చివరి నాటికి 29,000 డాలర్ల స్థాయిలో ఉన్న ఈ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ ఆ తర్వాత ఏకంగా 58,000 డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 45వేల దిగువకు పడిపోయినప్పటికి, తిరిగి పుంజుకుంది. తాజాగా కొత్త గరిష్టం 61,000 డాలర్లను తాకింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వంటి ఇన్వెస్టర్లు బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం, దీనికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి వివిధ కారణాలతో బిట్ కాయిన్ దూసుకెళ్తోంది.


Click it and Unblock the Notifications