Bitcoin: బిట్‌కాయిన్ అల్ టైం హై రికార్డు, అంత ట్రంప్ మాయ.. క్రిస్మస్ నాటికీ $120000 డాలర్లు బ్రేక్..
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర $100,000 డాలర్లు దాటింది. బిట్‌కాయిన్ తొలిసారి ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా విజయం తర్వాత దీని ధర నిరంతరం పెరుగుతోంది. అయితే ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో అనుకూల విధానాలను రూపొందిస్తుందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీల ధరలు పెరగడానికి కూడా ఇదే కారణం. ఈ ఏడాది బిట్‌కాయిన్ ధర 100 శాతం పెరిగింది. ట్రంప్ ఎన్నికల విజయం తర్వాత నాలుగు వారాల్లో దీని ధర 45% పెరిగింది. దీంతో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ తొలిసారిగా 2 లక్షల కోట్ల డాలర్లు దాటింది.
ట్రేడింగ్ ప్రారంభంలో బిట్‌కాయిన్ 2 శాతం కంటే పైకి పెరిగి ఆల్ టైమ్ హై $100,277కి చేరుకుంది. US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ప్రెసిడెంట్ గ్యారీ జెన్స్లర్ నిష్క్రమణ తర్వాత క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ఉపశమనం పొందవచ్చని భావిస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు లీడర్షిప్ వహించడానికి పాల్ అట్కిన్స్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. టోకెన్ అలయన్స్ కో-చైర్‌గా క్రిప్టోకరెన్సీ పాలసీలో అట్కిన్స్‌కు అనుభవం ఉంది. అట్కిన్స్ ప్రస్తుతం పటోమాక్ పార్టనర్స్ CEO. యుఎస్ ఎన్నికల నుండి ఈ బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లో సుమారు నాలుగు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు.

ధర ఎంత వరకు వెళ్తుంది?
ట్రంప్ ఎన్నికల ప్రచారంలో డిజిటల్ ఆస్తులకు మద్దతు ఇచ్చారు. అలాగే అమెరికాను క్రిప్టో రాజధానిగా స్థాపించడం ఇంకా నేషనల్ బిట్‌కాయిన్ రిజర్వ్ సృష్టించడం గురించి మాట్లాడారు. హాంకాంగ్‌లో ఉన్న స్వతంత్ర క్రిప్టోకరెన్సీ విశ్లేషకుడు జస్టిన్ డి'అనేతన్ మాట్లాడుతూ బిట్‌కాయిన్ $100,000 దాటడం కేవలం ఒక మైలురాయి కాదు. ఇది ఫైనాన్స్, టెక్ అండ్ జియోపాలిటిక్స్‌లో మార్పుకు నిదర్శనం అని అన్నారు.
దీనితో పాటు క్రిప్టోకరెన్సీ రంగం రెండేళ్ల క్రితం FTX క్రిప్టో ఎక్స్ఛేంజ్ మూసివేసినప్పుడు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. కంపెనీ వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. డిసెంబర్ 25 నాటికి బిట్‌కాయిన్ ధర 120,000 డాలర్లకు చేరుకుంటుందని డిజిటల్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కానరీ క్యాపిటల్ వ్యవస్థాపకుడు స్టీవెన్ మెక్‌క్లర్గ్ తెలిపారు. బిట్‌కాయిన్ ధరలు కొంతకాలంగా రోజురోజుకూ పెరుగుతు వస్తుంది. దింతో ఈ క్రిప్టో కరెన్సీ దాని పెట్టుబడిదారులకు గొప్ప ఆదాయాన్ని అందిస్తోంది. ఈ కారణంగా బిట్‌కాయిన్‌కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. రానున్న రోజుల్లో బిట్‌కాయిన్ మరింత పెరగవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications