క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ నేడు రెండు వారాల గరిష్టాన్ని తాకింది. ఈ డిజిటల్ కరెన్సీ 54,000 డాలర్ల మార్కును దాటింది. ఇటీవల బిట్ కాయిన్ వ్యాల్యూ భారీగా క్షీణించిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ పరుగు పెడుతోంది. యూఎస్ ట్రేడింగ్ ప్రారంభంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 4.6 శాతం ఎగిసింది. టెస్లా ఇంక్‌తో పాటు ఏఆర్‌కే ఇన్నోవేషన్ ఈటీఎఫ్ వంటి సంస్థలు ఊతమివ్వడంతో బిట్ కాయిన్ క్రమంగా పుంజుకుంటోంది.
తాము 200 మిలియన్ డాలర్లను సమీకరించామని ఇటీవల బిట్ కాయిన్ సంబంధిత ఫైనాన్షియల్ సర్వీసెస్ NYDIG తెలిపింది. స్టోన్ రిడ్జ్ హోల్డింగ్స్ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, న్యూ యార్క్ లైఫ్, మాస్ మ్యుచువల్, సోరోస్ ఫండ్ మేనేజ్‌మెంట్ వంటి వాటి నుండి ఈ నిధులను సమీకరించింది.

బిట్ కాయిన్‌తో పాటు మరో క్రిప్టోకరెన్సీ ఎథేరియమ్ బుల్లిష్‌గా ఉన్నాయి. క్రితం వారం వరకు కాస్త క్షీణించిన ఈ క్రిప్టోకరెన్సీ తిరిగి పుంజుకుంటోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్రిప్టో మరింత బలంగా కనిపిస్తోందని ఓండా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఎడ్వార్డ్ మోయా అన్నారు. బిట్ కాయిన్ వ్యాల్యూ త్వరలో 75,000 డాలర్లకు చేరుకోవచ్చునని క్రిప్టో మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications