క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు (జూలై 1) క్షీణించింది. బిట్ కాయిన్ వ్యాల్యూ నాలుగు శాతం మేర క్షీణించి 36 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఎథేరియం మాత్రం మూడు శాతం లాభపడింది. గురువారం నుండి క్రిప్టో కరెన్సీలు మిక్స్డ్‌గా ట్రేడ్ అయ్యాయి. పలువురు ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీలో ప్రాఫిట్ బుకింగ్ కోసం మొగ్గు చూపారు. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ క్షీణించింది. ఏప్రిల్-జూన్ కాలంలో బిట్ కాయిన్ నలభై శాతం క్షీణించింది. అయితే జూన్ నెలలో బిట్ కాయిన్ కాస్త సానుకూలంగా ట్రేడ్ అయింది.

బిట్ కాయిన్, ఎథేర్
గురువారం బిట్ కాయిన్ వ్యాల్యూ 34,355 డాలర్లకు పడిపోయింది. గత 24 గంటల్లో ఈ క్రిప్టో కరెన్సీ 3.71 శాతం క్షీణించింది. గత వారం రోజుల్లో 5.29 శాతం మారింది.
ఎథేరి గత 24 గంటల్లో 2.31 శాతం ఎగిసి 2,209 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత వారం రోజుల్లో 16.22 శాతం మారింది.
టెథెర్ గత ఇరవై నాలుగు గంటల్లో 0.03 శాతం ఎగిసి 1 డాలర్ వద్ద ట్రేడ్ అయింది. గత వారం రోజుల్లో 0.05 శాతం తగ్గింది.
బియాన్స్ కాయిన్ ఇరవై నాలుగు గంటల్లో 297 డాలర్లు నష్టపోయింది. ఏడు రోజుల్లో మాత్రం 5.14 శాతం లాభపడింది.
కార్డానో గత ఇరవై నాలుగు గంటల్లో 0.34 శాతం నష్టపోయి 1.34 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వారం రోజుల్లో 8.10 శాతం లాభపడింది.

డోజీకాయిన్
డోజీకాయన్ గత ఇరవై నాలుగు గంటల్లో 4.65 శాతం క్షీణించి 0.24 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడు రోజుల్లో 8.27 శాతం లాభపడింది.
XRP క్రిప్టో కరెన్సీ గత ఇరవై నాలుగు గంటల్లో 2.30 శాతం క్షీణించి 0.62 డాలర్లకు చేరుకుంది. ఏడు రోజుల్లో 9.16 శాతం ఎగిసింది.
యూఎస్‌డీ కాయిన్ ఇరవై నాలుగ గంటల్లో 0.04 శాతం లాభపడి 1 డాలర్ వద్ద ట్రేడ్ కాగా, గత వారం రోజుల్లో 0.04 శాతం నష్టపోయింది.
పోల్కాడాట్ ఒకరోజులో 3.27 శాతం క్షీణించి 15.83 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వారం రోజుల్లో 5.04 డాలర్లు క్షీణించింది.
యునిస్వాప్ ఇరవై నాలుగు గంటల్లో 1.22 శాతం లాభపడి 18.72 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వారం రోజుల్లో 11.75 శాతం ఎగిసింది.

బిట్ కాయిన్‌లో పెట్టుబడులు
ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు బిట్ కాయిన్ రూపంలోని వేతనం చెల్లిస్తున్నాయి. ఇందులో జీఎంవో గ్రూప్, ఐఎం, ఫెయిర్లీ వంటి సంస్థలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీపై ఇప్పటికీ సంధిగ్ధతత నెలకొంది. కొన్ని దేశాలు బిట్ కాయిన్ వంటి క్రిప్టోలకు ఆమోదం తెలిపితే, మరికొన్ని దేశాలు పక్కన పెడుతున్నాయి. మన దేశంలో బిట్ కాయిన్‌లో యువత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications