నిన్న క్షీణించిన బిట్ కాయిన్ నేడు మళ్లీ లాభపడింది. ఈ క్రిప్టో దిగ్గజం నేడు (అక్టోబర్ 14, గురువారం) తిరిగి 57,000 డాలర్లను దాటింది. గత వారం రోజుల్లోనే ఈ క్రిప్టో కరెన్సీ ఐదు శాతం మేర లాభపడింది. నిన్న స్వల్పంగా నష్టపోయినప్పటికీ మొత్తానికి ఈ వారం మాత్రం లాభపడింది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం కూడా 24 గంటల్లో ఐదు శాతం లాభపడింది. ఇక వారం రోజుల్లో రెండు శాతం లాభపడింది. ప్రస్తుతం ఇది 3600 డాలర్ల వద్ద ఉంది. సోలానా, ఎక్స్‌పీఆర్, కార్డానో క్రిప్టోలు మూడు శాతం వరకు లాభపడ్డాయి. పోల్కాడాట్ అయితే ఏకంగా 20 శాతం జంప్ చేసింది. ఇది 40 డాలర్ల పైన ఉంది. ఇటీవల క్షీణించిన డోజీకాయిన్ నేడు 5 శాతం లాభపడింది.
బిట్ కాయిన్ చాలా రోజుల తర్వాత ఈ వారం 57,000 డాలర్లను తాకింది. మే నెల తర్వాత మొదటిసారి ఈ మార్కుకు చేరుకుంది. ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, కొద్ది నెలలుగా ఊగిసలాటలో ఉంది. అయితే ఇటీవల మళ్లీ జంప్ చేస్తోంది. బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మే నెల తర్వాత సెప్టెంబర్. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 50వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 55వేల డాలర్ల పైకి చేరుకుంది. జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో 40వేల డాలర్ల నుండి 50 వేల డాలర్ల మధ్య కదలాడింది. రెండు రోజుల క్రితం 57,000 డాలర్లకు చేరుకున్నప్పటికీ, నిన్న మళ్లీ 56,000 స్థాయికి పడిపోయింది. అయితే అంతలోనే మళ్లీ జంప్ చేసింది. బిట్ కాయిన్ 2023 నాటికి లక్ష డాలర్లకు చేరుకోవచ్చుననే అంచనాలు ఉన్నాయి.

వివిధ క్రిప్టో కరెన్సీల వృద్ధి
బిట్ కాయిన్ నేడు ఉదయం 5 శాతం, ఎథేరియం 5 శాతం మేర లాభపడ్డాయి. అయితే సాయంత్రానికి కాస్త తగ్గినప్పటికీ మంచి లాభాల్లోనే ఉన్నాయి. వివిధ క్రిప్టో కరెన్సీలు ఎంత శాతం లాభపడ్డాయంటే... బిట్ కాయిన్ 3.24 శాతం, ఎథేరియం 4.17 శాతం, బియాన్స్ కాయిన్ 1.64 శాతం, కార్డానో 2.23 శాతం, టెథేర్ 0.02 శాతం, ఎక్స్‌పీఆర్ 1.31 శాతం, సోలానా 0.57 శాతం, పోల్కాడాట్ 18.61 శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం, డోజీకాయిన్ 3.31 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications