ఎలాన్ మస్క్ టెస్లా ఎఫెక్ట్, బిట్ కాయిన్ భారీగా జంప్: అందుకే విక్రయించిన టెస్లా ఇంక్
ఎలక్ట్రిక్ కార్ మేకర్ టెస్లా ఇంక్ గతంలో బిట్ కాయిన్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడంతో క్రిప్టోకరెన్సీ ఎగిసిపడింది. ఇటీవల టర్కీ క్రిప్టో రద్దు నిర్ణయం, అమెరికా అధ్యక్షులు జోబిడెన్ డబుల్ ట్యాక్స్ ప్రకటన నేపథ్యంలో గతవారం బిట్ కాయిన్ సహా క్రిప్టోకరెన్సీ దారుణంగా పతనమైంది. ఓ సమయంలో బిట్ కాయిన్ 50వేల డాలర్ల దిగువకు పడిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు జంప్ చేస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో 50వేల దిగువన పలికిన బిట్ కాయిన్ ఇప్పుడు 55వేల దిశగా పరుగెడుతోంది.

బిట్ కాయిన్ ప్రత్యామ్నాయం
తాజాగా నగదుకు ప్రత్యామ్నాయంగా బిట్ కాయిన్ అని నిరూపించేందుకు టెస్లా తన బిట్ కాయిన్ పెట్టుబడులను కొంత మొత్తాన్ని విక్రయించింది. ఈ మేరకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ మళ్లీ పెరుగుతోంది. తన బిట్ కాయిన్ హోల్డింగ్స్‌లో పది శాతం మొత్తాన్ని విక్రయించింది టెస్లా. ఈ మేరకు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే తాను ఎలాంటి వ్యక్తిగత బిట్ కాయిన్స్ విక్రయించలేదని చెప్పారు.

ట్వీట్‌కు స్పందన
ఎలాన్ మస్క్ బిట్ కాయిన్‌ను కొనుగోలు చేశారని, తాను సంపదను సృష్టించుకోవడానికి దీనిని కొనుగోలు చేశాడని బార్స్టూల్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డేవ్ పోర్‌ట్నోయ్ ట్వీట్ చేశారు. దీంతో ఎలాన్ మస్క్ స్పందించారు. తాను వ్యక్తిగత బిట్ కాయిన్స్‌ను విక్రయించలేదని, టెస్లా నుండి మంది లిక్విడిటీకి ప్రత్యామ్నాయంగా నిరూపించేందుకు 10 శాతం విక్రయించినట్లు తెలిపారు.

టెస్లా డిజిటల్ అసెట్స్ లాభం
టెస్లా డిజిటల్ అసెట్స్ 2021 క్యాలెండర్ ఏడాది మొదటి త్రైమాసికంలో 272 మిలియన్ డాలర్ల లాభాలను ప్రకటించింది. దీంతో ఆదివారం 49,059 డాలర్ల వద్ద క్లోజ్ అయిన బిట్ కాయిన్ సోమవారం ఏకంగా 54,017 డాలర్లకు పెరిగింది. బిట్ కాయిన్ ఈ వారం 54వేల డాలర్లకు రావడం ఇదే మొదటిసారి. బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా జంప్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications