న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ.. కొంతకాలంగా దేశీయ మార్కెట్‌లో రోజూ వార్తల్లో ఉంటూ వస్తోంది. తక్కువ సమయంలో లక్షాధికారులు కావడానికి ఇందులో భారీగా పెట్టుబడులను పెడుతుంటారు. అలాంటి మార్కెట్ ఇవ్వాళ భారీగా పతనాన్ని చవి చూసింది. కొన్నింటి రేట్లు ఫర్వాలేదనిపించుకుంటున్నాయి. అత్యధిక విలువ పలికే బిట్ కాయిన్, ఇథేరియం ధరలు మాత్రం దిగజారాయి.
బిట్ కాయిన్ వాల్యూ ఎనిమిది శాతానికి పైగా క్షీణించింది. 18 నెలల తరువాత బిట్ కాయిన్ ధర ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బిట్‌కాయిన్ రేటు 24,903.49 డాలర్ల కంటే దిగువకు నమోదైంది. 2020 డిసెంబర్ తరువాత మళ్లీ ఈ రేంజ్‌లో తగ్గింది. బిట్ కాయిన్ విలువ పడిపోవడం వరుసగా ఇది అయిదోసారి. మొత్తంగా 15 శాతం మేర క్షీణత కనిపించింది.
ఇథేరియం క్రిప్టోకరెన్సీ విలువ కూడా ఎనిమిది శాతం మేర పడిపోయింది. బిట్ కాయిన్ తరువాత దాని స్థాయిలో విలువ చేసే రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఇది. 15 నెలల కనిష్ఠానికి దిగజారింది. అయిదు రోజుల వ్యవధిలో దీని విలువ 25 శాతానికి క్షీణించింది. ఇథేరియం ట్రేడింగ్ 1,350 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

బినాన్స్ చెయిన్ కాయిన్ ప్రైస్‌లోనూ పతనం కనిపించింది. 11.07 శాతం దిగజారింది. 24 గంటల వ్యవధిలో బినాన్స్ కాయిన్ నష్టపోయిన డాలర్ల సంఖ్య 256.83. ఏడు రోజుల వ్యవధిలో 13.75 శాతం మేర మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను నష్టపోయింది ఇది. క్రిప్టో అస్సెట్స్‌లో అయిదో అతిపెద్ద మార్కెట్ క్యాప్ ఉంది ఈ కాయిన్‌కు.
ఎక్స్ఆర్పీ కాయిన్ ప్రైస్ 10.15 శాతం తగ్గింది. 24 గంటల ట్రేడింగ్ వ్యవధిలో 0.3466 మేర దీని విలువ పడిపోయింది. ఇక వారం రోజుల్లో సంభవించిన పతనాన్ని పరిగణనలోకి తీసుకుంటే 11.56 శాతం పడిపోయింది. సొలొన, కార్డానో, డోజ్ కాయిన్, పొల్కాడాట్, ట్రాన్ వంటి క్రిప్టోకరెన్సీ వేల్యూ మొత్తం 6 నుంచి 14 శాతం వరకు క్షీణించింది.


Click it and Unblock the Notifications