క్రిప్టో కరెన్సీ భారీగా పతనమవుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ నేడు 32,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇది ఓ సమయంలో 30,000 డాలర్ల దిగువన కూడా ట్రేడ్ అయింది. టాప్ క్రిప్టోల్లో ఎథేరియం, సోలానా మాత్రమే కాస్త లాభపడ్డాయి. దాదాపు అన్ని క్రిప్టోలు నష్టపోయాయి. మీమ్ కాయిన్స్ విషయానికి వస్తే డోజీకాయిన్ నష్టపోగా, షిబా ఇను లాభాల్లో ఉంది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 35,591 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 29,763 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 32,813 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 28,825.76 డాలర్లు. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గత ఇరవై నాలుగు గంటల్లో 602 బిలియన్ డాలర్ల మేర తగ్గింది.

వివిధ క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 3.51 శాతం క్షీణించి 31,633 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 2.33 శాతం క్షీణించి 0.5183 డాలర్లు, టెర్రా 48.78 శాతం క్షీణించి 30 డాలర్లు, అవాలాంచె 48 డాలర్ల వద్ద, టెర్రా యూఎస్డీ 6.67 శాతం క్షీణించి 0.9222 డాలర్లు, స్టెల్లార్ 2.72 శాతం క్షీణించి 0.150 డాలర్లు, డోజీకాయిన్ 2.19 శాతం తగ్గి 0.113 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక సోలానా 0.35 శాతం, క్రిప్టో డాట్ కామ్ 1.93 శాతం, కార్డానో 0.97 శాతం, షిబా ఇను 2.73 శాతం ఎగిసిపడింది.
నేడు భారీగా లాభపడిన క్రిప్టోల విషయానికి వస్తే మేకర్ 7.68 శాతం, పాలీగోన్ 6.70 శాతం, ట్రోన్ 2.50 శాతం, షిబా ఇను 1.97 శాతం, క్రిప్టో డాట్ కామ్ 1.82 శాతం లాభపడగా, భారీగా నష్టపోయిన వాటిలో టెర్రా 49 శాతం పడిపోయింది. అంటే దాదాపు సగం క్షీణించింది.


Click it and Unblock the Notifications