బిట్ కాయిన్, ఎథేరియం, టెర్రా, సోలానా 6 శాతానికి పైగా జంప్
క్రిప్టో కరెన్సీ పరుగు పెడుతోంది. రెండు రోజుల క్రితం 40,000 డాలర్ల దిగువన ట్రేడ్ అయిన క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ఇప్పుడు 42,000 డాలర్లు దాటింది. ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం కూడా 3100 డాలర్లకు పైనే ఉంది. గత 24 గంటల్లో క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ వ్యాల్యూ 2.71 శాతం ఎగిసి రూ.42,102 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయంలోను 40,800 దిగువకు పడిపోలేదు. ఈ సమయంలో 40,871 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 42,199 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు, కనిష్టం 28,825.76 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో మార్కెట్ క్యాప్ 800 బిలియన్ డాలర్లు పెరిగింది.
వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే బిట్ కాయిన్ 2.77 శాతం లాభపడి 42.146 డాలర్ల వద్ద, ఎథేరియం 3.08 శాతం ఎగిసి 3159 డాలర్ల వద్ద, ఎక్స్‌ఆర్‌పీ 0.13 శాతం ఎగిసి 0.771284 డాలర్ల వద్ద, టెర్రా 5.88 శాతం ఎగిసి 96.36 డాలర్ల వద్ద, సోలానా 6.59 శాతం ఎగిసి 110.27 డాలర్ల వద్ద, అవాలాంచె 2.61 శాతం ఎగిసి 80.74 డాలర్ల వద్ద, కార్డానో 3.97 శాతం ఎగిసి 0.973 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 4.81 శాతం ఎగిసి 19.31 డాలర్ల వద్ద, స్టెల్లార్ 0.74 శాతం ఎగిసి 0.205 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 3.32 శాతం లాభపడి 0.14515 డాలర్లు, షిబా ఇను 1.98 శాతం లాభపడి 0.000026 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

టాప్ ట్రేడర్స్ విషయానికి వస్తే ఎక్స్‌ఆర్‌పీ, టెర్రా, సోలానా, ట్రోన్, డోజీకాయిన్, ది శాండ్ బాక్స్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ విషయానికి వస్తే సింథెటిక్స్, ఏవ్, స్టోర్జ్, స్కేల్, కుసామా, లూప్రింగ్, సోలానా, సీలో, కర్వ్ డావ్ టోకెన్, టెర్రా, 6 శాతం నుండి 31 శాతం మధ్య ట్రేడ్ అయ్యాయి. సింథెటిక్స్ 31 శాతం ఎగిసిపడింది. టాప్ లూజర్స్‌లో కైబర్ నెట్ వర్క్ 3.22 శాతం నష్టపోయింది.


Click it and Unblock the Notifications