క్రిప్టో కరెన్సీ సానుకూలంగా ఉంది. బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ కీలక క్రిప్టో కరెన్సీలు 4 శాతం నుండి 11 శాతం మేర లాభపడ్డాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో నిన్న భారీగా పతనమయ్యాయి. అయితే ఆ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లుగా వార్తలు రావడంతో క్రిప్టో మళ్లీ పుంజుకుంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నిన్న ఉద్రిక్తతల నేపథ్యంలో 42,000 డాలర్ల దిగువకు పడిపోయింది. నేడు పరిస్థితి సద్దుమణిగిన తర్వాత 44,000 డాలర్లు దాటింది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 4.24 శాతం లాభపడి 44,240 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత 24 గంటల్లో కనిష్టం 41,841 డాలర్లు, గరిష్టం 44,438 డాలర్లు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 839 బిలియన్ డాలర్లు పెరిగింది. 52 వారాల కనిష్టం 52,537 డాలర్లు, గరిష్టం 68,990 డాలర్లు. అయితే బిట్ కాయిన్ 2022 క్యాలెండర్ ఏడాదిలో మాత్రం 4.30 శాతం తగ్గింది.

ఇతర క్రిప్టోల విషయానికి వస్తే ఎథేరియం 6.22 శాతం ఎగిసి 3111 డాలర్లు, ఎక్స్పీఆర్ 4.38 శాతం లాభపడి 0.833 డాలర్లు, సోలానా 8.24 శాతం ఎగిసి 102.20 డాలర్లు, టెర్రా 7.73 శాతం లాభపడి 56.40 డాలర్లు, కార్డానో 4.27 శాతం ఎగిసి 1.09 డాలర్లు, అవాలాంచె 11.21 శాతం ఎగిసి 88.35 డాలర్లు, స్టెల్లార్ 3.32 శాతం లాభపడి 0.218 డాలర్లు, పోల్కాడాట్ 6.72 శాతం ఎగిసి 19.79 డాలర్లు, డోజీకాయిన్ 2.82 శాతం ఎగిసి 0.1500 డాలర్లు, షిబా ఇను 2.77 శాతం ఎగిసి 0.000031 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications