నిన్నటి వరకు ఎగిసిపడిన క్రిప్టో కరెన్సీ నేడు క్షీణించింది. క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ సహా అన్ని క్రిప్టోలు పతనమయ్యాయి. కేవలం యూఎస్డీ కాయిన్ మాత్రమే దాదాపు స్థిరంగా ఉంది. అత్యధికంగా పోల్కాడాట్ 10 శాతానికి పైగా, డోజీకాయిన్ దాదాపు పది శాతం క్షీణించింది. గతవారం ఇన్వెస్టర్లు 22.1 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ ఫండ్స్‌ను వెనక్కి తీసుకున్నారు. గతవారం బిట్ కాయిన్ 42,924 నుండి నిన్న 47,831 డాలర్ల స్థాయికి చేరుకుంది. అయితే నేడు మళ్లీ 47,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ నుండి క్రితం సెషన్లో 22 మిలియన్డాలర్లు, ఎథేర్ నుండి 1.1 మిలియన్ డాలర్ల మేర వెనక్కి తీసుకున్నట్లు డేటా వెల్లడిస్తోంది.
డిజిటల్ అసెట్ మేనేజర్ క్రమంగా మెరుగుపడుతోందని, క్రిప్టో కరెన్సీ ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతోందని క్రిప్టో మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 4.5 బిలియన్ డాలర్లకో ప్రపంచ రెండో అతిపెద్ద డిజిటల్ అసెట్ మేనేజర్ అయిన కాయిన్ షేర్స్ నుండి గతవారం ఔట్ ఫ్లో 16 మిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ బిగ్గెస్ట్ డిజిటల్ అసెట్ మేనేజర్ గ్రేస్కేల్ ఇన్‌ఫ్లో కేవలం 0.3 డిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంది. వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ ఇలా ఉంది...

- Bitcoin - $45,038.10 - 3.04 శాతం క్షీణించింది.
- Ethereum - $3,039.61 - 4.88 శాతం క్షీణించింది.
- Binance Coin - $396.30 - 7.19 శాతం క్షీణించింది.
- Tether - $1.00 - 0.01 శాతం క్షీణించింది.
- Cardano - $1.98 - 6.83 శాతం క్షీణించింది.
- Dogecoin $0.29 9.95 శాతం క్షీణించింది.
- XRP - $1.11 - 8.19 శాతం క్షీణించింది.
- Polkadot - $23.96 - 10.47 శాతం క్షీణించింది.
- USD Coin - $1.00 - 0.01 శాతం క్షీణించింది.
- Solana - $66.23 - 7.98 శాతం క్షీణించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications