cryptoc prices today: బిట్ కాయిన్, ఎథేరియం భారీ జంప్,
క్రిప్టో కరెన్సీ ర్యాలీ కొనసాగుతోంది. బిట్ కాయిన్, ఎథేరియం వంటి దిగ్గజ క్రిప్టోలు గత వారం రోజుల్లో పది శాతానికి పైగా ర్యాలీ చేశాయి. నేడు బిట్ కాయిన్, డోజీకాయిన్, కార్డానోలు 3 శాతం నుండి 5 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్‌తో పోలిస్తే 2.63 శాతం పెరిగి 2.94 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. బిట్ కాయిన్ 67,000 డాలర్ల మార్కు దాటింది. గత వారం రోజుల్లోనే ఈ క్రిప్టో పది శాతం లాభపడింది. ఎథేరియం 1.8 శాం ఎగిసి 4,806 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్‌లాగే ఎథేరయం కూడా పది శాతానికి పైగా లాభపడింది. బిట్ కాయిన్ ఈ సంవత్సరం 130 శాతం ఎగిసింది.
కార్డానో గత ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది శాతం లాభపడింది. గత వారం రోజుల్లోనే 14 శాతం పెరిగింది. ప్రస్తుతం ఇది 2.23 శాతం వద్ద ట్రేడ్ అయింది. పోల్కాడాట్ గత వారం రోజుల్లో 9 శాతం లాభపడింది. ఇది 52.87 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డోజీకాయిన్ క్రితం సెషన్‌తో పోలిస్తే 3 శాతం ఎగిసింది. వారంలో 2 శాతం లాభపడింది. ప్రస్తుతం ఇది 0.28 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వివిధ క్రిప్టో కరెన్సీ వృద్ధి...
నేటి సాయంత్రం సెషన్ వరకు బిట్ కాయిన్ 5 శాతం, ఎథేరియం 2 శాతం, బియాన్స్ కాయిన్ 1.5 శాతం, కార్డానో 5.15 శాతం, ఎక్స్‌ఆర్‌పీ1.60 శాతం, పోల్కాడాట్ 0.07 శాతం, డోజీకాయిన్ 5.3 శాతం లాభపడ్డాయి. అయితే సోలానా 1 శాతం, టెథెర్ 0.06 శాతం, యూఎస్‌డీ కాయిన్ 0.04 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications