క్రిప్టో కరెన్సీ మహాపతనం, బిట్ కాయిన్ 20,000 డాలర్లకు డౌన్
క్రిప్టో మార్కెట్ ఇటీవల దారుణంగా పతనమవుతోంది. రెండు రోజుల క్రితం కుప్పకూలిన క్రిప్టో కరెన్సీలు, నిన్న కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ, నేడు అంతకంటే క్షీణించింది. బిట్ కాయిన్ 20,000 డాలర్ల స్థాయికి పడిపోగా, ఎథేరియం ఏకంగా 1000 డాలర్ల స్థాయికి వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం 68,990 డాలర్ల నుండి బిట్ కాయిన్ మూడింట రెండు వంతులకు పైగా పడిపోగా, ఎథేరియం అయితే దాదాపు ఐదింట నాలుగు వంతుల వరకు క్షీణించింది.
బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 10.51 శాతం క్షీణించి 20,104 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 20,101 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 22,753 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ ఇరవై నాలుగు గంటల్లో 383 బిలియన్ డాలర్లు క్షీణించింది. 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు, కనిష్టం 20,298.10 డాలర్లు. ఎథేరియం ఆల్ టైమ్ గరిష్టం 4,865.57 డాలర్లు కాగా, ప్రస్తుతం 1,020.16 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది 15.50 శాతం పతనమైంది.

వివిధ క్రిప్టో వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 10.5 శాతం, ఎథేరియం 15.50 శాతం, బియాన్స్ కాయిన్ 11.71 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 5 శాతం, కార్డానో 8.43 శాతం, సోలానా 10 శాతం, స్టెల్లార్ 5 శాతం, క్రిప్టో డాట్ కామ్ 12 శాతం, పోల్కాడాట్ 8 శాతం, మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 9.5 శాతం, షిబా ఇను 7.17 శాతం క్షీణించాయి.
టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఉమా ప్రోటోగాల్ 15 శాతం ఎగిసిపడింది. టాప్ లూజర్స్ విషయానికి వస్తే నెక్సో, ఫెచ్ డాట్ ఏఐ, టెర్రా యూఎస్డీ, బాంకోర్, ట్రోన్, కాంపౌండ్, వేవ్స్, లైవ్ పీర్, పాంకేక్ స్వాప్, ఎథేరియం, ఏప్ కాయిన్ 15 శాతం నుండి 18 శాతం వరకు పడిపోయాయి.


Click it and Unblock the Notifications