Bitcoin: క్రిప్టో ట్రేడర్స్‌కు భారీ షాక్.. నిండా ముంచిన బిట్‌కాయిన్
Bitcoin: తక్కువ వ్యవధిలో ఎక్కువ రాబడి ఆశతో గతంలో పలువురు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టేవారు. ప్రముఖ అంతర్జాతీయ కార్ల కంపెనీ టెస్లా కూడా బిట్ కాయిన్స్ ద్వారా పేమెంట్ కు గతంలో ఓకే చెప్పడంతో.. అప్పట్లో వీటి వినియోగం మరింత పెరిగింది. అయితే భారత ప్రభుత్వం నిబంధనల వల్ల ఇండియాలో క్రిప్టో అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపడం లేదు.
క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్స్ ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన 'స్పేస్ ఎక్స్' సహా పలువురు అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఒకేసారి డంప్ చేయడంతో.. బిట్ కాయిన్ నిన్న దాదాపు 7 శాతం క్షీణించింది. 27 వేల డాలర్ల దిగువకు పడిపోయింది.

అంతర్జాతీయంగా ఆయా ప్రభుత్వాల బాండ్స్ రిటర్నులు దాదాపు 15 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరడమూ ఇందుకు ఓ కారణంగా తెలుస్తోంది. దీనికితోడు ఇదే సమయంలో స్పేస్ ఎక్స్ కూడా 373 మిలియన్ డాలర్ల క్రిప్టోకరెన్సీని విక్రయించడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే బిట్ కాయిన్స్ నిల్వల లిక్విడేషన్ వెనకున్న కారణాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
ఆగస్టు 18 నాటికి బిట్ కాయిన్ ధర 25 వేల 392 డాలర్లకు చేరుకుంది. నిన్న మధ్యాహ్నం రెండున్నర సమయంలో 26 వేల 551 వద్ద ట్రేడయింది. అంటే 6.91 శాతం మేర క్షీణించింది. ఇండియాలో బిట్ కాయిన్ ను చట్టబద్ధమైన కరెన్సీగా గుర్తించలేదు. కానీ పలువురు దేశీయ ఇన్వెస్టర్స్ ఇప్పటికీ క్రిప్టో ట్రేడింగ్ చేస్తూనే ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications