For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో బిట్ కాయిన్ కంపెనీ కార్యాలయం, ప్రభుత్వం నిషేధిస్తుందా?

|

బిట్ కాయిన్ కంపెనీ, క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్‌బేస్ భారత్‌లో కార్యకలపాల కోసం ఆఫీస్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయివేటు క్రిప్టోకరెన్సీలను కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తుందనే ప్రచారం సాగుతోంది. అయితే అన్ని క్రిప్టోకరెన్సీలను బ్యాన్ చేయలేమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అదే సమయంలో క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ని ఊగిసలాటల మధ్య కాయిన్‌బేస్ మన దేశంలో కార్యాలయం తెరుస్తానని ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే భారత్‌లో కార్యకలాపాల కోసం పలు ఉద్యోగాల ప్రకటన చేసింది.

గుడ్‌న్యూస్: ఆ ప్రకటన వెనక్కి! స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేట్లు యథాతథంగుడ్‌న్యూస్: ఆ ప్రకటన వెనక్కి! స్మాల్ సేవింగ్స్ స్కీం వడ్డీ రేట్లు యథాతథం

భారత్ టాలెంట్ పైన ప్రశంసలు

భారత్ టాలెంట్ పైన ప్రశంసలు

భారత్‌లో ఇంజినీరింగ్, సాఫ్టువేర్ గ్రోత్, కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్‌ను ప్రారంభిస్తామని, క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేసేవారికి, విక్రయించే వారికోసం ఇది దోహదపడుతుందని కాయిన్‌బేస్ తెలిపింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ ఆవిష్కరణలకు ఎంతోకాలంగా భారత్ పెట్టింది పేరని, ఇక్కడ వరల్డ్ క్లాస్ టాలెంట్ ఉందని, ఈ టాలెంట్ కాయిన్‌బేస్ గ్రూప్‌కు దోహదపడుతుందని పేర్కొంది. క్రిప్టోఎకానమీ వృద్ధికి తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారత టాలెంట్ వివిధ మార్గాల్లో ుపయోగపడుతుందని తెలిపింది.

హైదరాబాద్‌లో కార్యాలయం

హైదరాబాద్‌లో కార్యాలయం

త్వరలో హైదరాబాద్‌లో కార్యాలయం ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయని కాయిన్‌బేస్ తెలిపింది. కరోనా మహమ్మారి నిబంధనలకు అనుగుణంగా ఈ ఫిజికల్ ఆఫీస్ ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా, కాయిన్ బేస్ నాస్‌డాక్‌లో ఐపీవోకు ప్లాన్ చేస్తోంది. అయితే అమెరికా కమోడిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) 6.5 డాలర్ల జరిమానా విధించిన అనంతరం దీనిని వాయిదా వేసింది. అయితే ఎప్పుడైనా ఐపీవోకు రావొచ్చు.

బ్యాన్ చేస్తారా...

బ్యాన్ చేస్తారా...

మరోవైపు, భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీని నిషేధించాలని భావిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసే ఆలోచనలో భారత ప్రభుత్వం ఉందనే ప్రచారం మధ్యలో కాయిన్‌బేస్ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం గమనార్హం.

English summary

హైదరాబాద్‌లో బిట్ కాయిన్ కంపెనీ కార్యాలయం, ప్రభుత్వం నిషేధిస్తుందా? | Bitcoin Company Coinbase Opens Office In India Amid Crypto Ban Reports

Coinbase, a cryptocurrency exchange, has announced that it will open a business presence in India. Despite rumours that the government may ban cryptocurrencies, the company has posted multiple job openings for its Indian operations. Coinbase revealed in a blog post that it will set up engineering, software growth, and customer service operations in India for people who want to buy and sell cryptocurrency.
Story first published: Thursday, April 1, 2021, 16:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X