బిట్ కాయిన్ నెలల తర్వాత 60,000 డాలర్ల దిశగా పరుగులు పెడుతోంది. బిట్ కాయిన్ నేడు 57,000 డాలర్లను తాకింది. భారత కరెన్సీలో ఇది రూ.42 లక్షలకు పైన. మే నెల తర్వాత మొదటిసారి ఈ మార్కుకు చేరుకుంది. ఈ ఏడాది మే నెల నుండి స్వల్పంగా లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, కొద్ది నెలలుగా ఊగిసలాటలో ఉంది. అయితే ఇటీవల మళ్లీ జంప్ చేస్తోంది. బిట్ కాయిన్‌కు బిగ్గెస్ట్ మంత్లీ లాస్ మే నెల తర్వాత సెప్టెంబర్. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 50వేల డాలర్ల మధ్య కదలాడి, ఇటీవల 55వేల డాలర్ల పైకి చేరుకుంది. జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో 40వేల డాలర్ల నుండి 50 వేల డాలర్ల మధ్య కదలాడింది. ఇప్పుడు 57,000 డాలర్లకు చేరుకుంది.
అక్టోబర్ రెండో వారం నుండి బిట్ కాయిన్స్ జంప్ చేస్తున్నాయి. బిట్ కాయిన్, ఎథేరియం... ఇలా అన్ని కాయిన్స్ కూడా ప్రస్తుతం లాభపడుతున్నాయి. అయితే సోలానా, రిప్పిల్, పోల్కాడాట్, టెథేర్ వంటి కాయిన్స్ మాత్రం నష్టపోయాయి. ఇవి రెండు శాతం నుండి మూడు శాతం మేర క్షీణించాయి. బిట్ కాయిన్ నేడు నాలుగు శాతం మేర లాభపడింది. వారం రోజుల్లో పదహారు శాతం లాభపడింది.

ఉదయం వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
- Bitcoin - రూ.44,45,270 - 3.68% జంప్,
- Ethereum - రూ.2,79,000 - 1.21% జంప్,
- Tether - రూ.77.84 - 0.21% జంప్,
- Cardano - రూ.172.0079 - 1.15% డౌన్,
- Binance Coin - రూ.32,550 - 0.43% జంప్,
- XRP - రూ.90.1998 - 1.63% డౌన్,
- Polkadot - రూ.2,736.96 - 3.63% డౌన్,
- Dogecoin - రూ.18.331 - 3.11% డౌన్


Click it and Unblock the Notifications