క్రిప్టో కరెన్సీ నేడు మిశ్రమంగా కదలాడుతోంది. ప్రపంచ క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు ఓ సమయంలో 45,000 డాలర్లు క్రాస్ చేసింది. అదే సమయంలో 43,000 డాలర్ల దిగువకు కూడా చేరుకుంది. దాదాపు మూడువేల డాలర్ల మధ్య కదలాడింది. ప్రస్తుతం 43,500 డాలర్లకు పైన ఉంది. గత కొద్ది సెషన్‌లలోనే ఇది 15 శాతానికి పైగా లాభపడింది. అయితే 2022 క్యాలెండర్ ఏడాదిలో మాత్రం 5.3 శాతం క్షీణించింది. ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్ల నుండి ఇప్పటికీ 35 శాతం తక్కువగా ఉంది. నవంబర్ 2021లో బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 2.12 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లోను 0.49 శాతం లాభపడింది.
వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే (ఈ వార్త రాసే సమయానికి) బిట్ కాయిన్ 0.49 శాతం లాభపడి 43,683 డాలర్లు, ఎథేరియం 0.52 శాతం ఎగిసి 3,119 డాలర్లు, సోలానా 0.04 శాతం లాభపడి 107 డాలర్లు, టెర్రా 0.50 శాతం లాభపడి 54.35 డాలర్లు, కార్డానో 0.28 శాతం ఎగిసి 1.16 డాలర్లు, అవాలాంచె 5.40 శాతం లాభపడి 90.51 డాలర్లు, స్టెల్లార్ 0.17 శాతం ఎగిసి 0.229 డాలర్లు, డోజీకాయిన్ 0.84 శాతం ఎగిసి 0.153 డాలర్లు, షిబా ఇను 2.06 శాతం లాభపడి 0.000032 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇక, ఎక్స్‌పీఆర్ 2.63 శాతం నష్టపోయి 0.820, పోల్కాడాట్ 1.17 శాతం క్షీణించి 20.60 డాలర్లు నష్టపోయాయి.

క్రిప్టో మార్కెట్‌లోకి వరుసగా మూడో వారం నిధులు వచ్చాయి. గతవారం 133 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇందులో కేవలం బిట్ కాయిన్‌లోకి వచ్చిన ఇన్-ఫ్లోనే 71 మిలియన్ డాలర్లు. డిసెంబర్ నుండి ఇది గరిష్టం. అలాగే వరుసగా మూడో వారం ఇన్-ఫ్లో కనిపించింది. ఈ మూడు వారాల్లో బిట్ కాయిన్‌లోకి 100 మిలియన్ డాలర్లకు పైగా వచ్చాయి.


Click it and Unblock the Notifications