క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయిన్ 32,000 డాలర్ల దిగువకు వచ్చింది. ఇటీవల క్రిప్టో కరెన్సీలు క్షీణిస్తున్నాయి. నేడు (జూలై 14, బుధవారం) బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్, పోల్కాడాట్ దారుణంగా పతనమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో బిట్ కాయిన్ ఏకంగా 65,000 డాలర్ల మార్కుకు చేరుకొని జీవన కాల గరిష్టాన్ని తాకింది. అయితే ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తోంది. ఇటీవల బిట్ కాయిన్ 30,000 డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్యనే కదలాడుతోంది.
ఇటీవల అయితే దారుణంగా పతనమై 33,000 డాలర్లకు దిగువనే ఉంటోంది. నేడు బిట్ కాయిన్ నాలుగు నుండి 8 శాతం మేర క్షీణించి 31,858 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథేరియం ఏడు శాతం నుండి 21 శాతం క్షీణించి 2000 డాలర్ల నుండి 1883 డాలర్ల దిగువకు పడిపోయింది. డోజీకాయిన్ 7 శాతం క్షీణించి 0.18 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కార్డానో, యూనిస్వాప్, XRP తదితర క్రిప్టోలు కూడా ఆరు శాతం వరకు క్షీణించాయి.

జూన్ నెలలో 40 శాతం డౌన్
క్రిప్టో కరెన్సీ జూన్ నెలలో 40 శాతం క్షీణించాయి. టర్కీ, చైనా నిర్ణయాల అనంతరం ఇటీవల బిట్ కాయిన్ పడిపోతోంది. స్పాట్ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 42.7 శాతం క్షీణించి 2.7 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. డెరివేటివ్ వ్యాల్యూమ్స్ 40.7 శాతం తగ్గి 3.2 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది.
2021 రెండో అర్ధ సంవత్సరం ప్రారంభం నుండే క్రిప్టో పెట్టుబడుల ఉత్పత్తులు, ఫండ్స్ నుండి ఔట్ ఫ్లో పెరిగింది. జూలై 9వ తేదీతో ముగిసిన వారంలో 4 మిలియన్ డాలర్ల క్రిప్టో ఔట్-ఫ్లో నమోదయింది. గత ఏడాది అక్టోబర్ నెల తర్వాత ఇదే అధికం.

ఔట్-ఫ్లో, ఇన్-ఫ్లో
ఈ ఏడాది బిట్ కాయిన్‌లోకి 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఎథేరియం నుండి ఔట్ ఫ్లో తక్కువగా ఉంది. ఇక్కడి నుండి గత వారం 8,00,00 డాలర్ల ఔట్-ఫ్లో నమోదయింది. దీంతో ఎథేరియం నుండి నెట్ ఇన్-ఫ్లో 961 మిలియన్ డాలర్లుగా ఉంది.

క్రిప్టో వ్యాల్యూ
బిట్ కాయిన్ - 31,938.60 డాలర్లు, ఎథేరియం 1,890.57 డాలర్లు, బియాన్స్ కాయిన్ 295.95 డాలర్లు, టెథేర్ 1.00 డాలర్లు, కార్డానో 1.22 డాలర్లు, డోజీకాయిన్ 0.19 డాలర్లు, XRP 0.59 డాలర్లు, పోల్కాడాట్ 9.60 డాలర్లు, USD కాయిన్ 1 డాలర్లు, యూనిస్వాప్ 17.53 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications