42,000 సమీపానికి చేరుకున్న బిట్‌కాయిన్, 2 నెలల గరిష్టానికి..
క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ గురువారం నాటి సెషన్‌లో ఏకంగా 42,000 డాలర్ల సమీపానికి చేరుకుంది. అయినప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం 65,000 డాలర్ల నుండి 35 శాతం తక్కువగా ఉంది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ ఈ వారం భారీగా ఎగిసింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యల అనంతరం క్రిప్టో కరెన్సీ ఎగిసిపడుతోంది. అందుకే ఈ వారం ప్రారంభంలో 30,000 డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్, ఇప్పుడు 42,000 డాలర్ల స్థాయికి వచ్చింది. టాప్ 20 బిట్ కాయిన్స్‌లో దాదాపు అన్నీ కూడా లాభపడుతున్నాయి. చైన్‌లిక్ అన్ని క్రిప్టోల్లో అత్యంత ఎక్కువగా 13 శాతం లాభపడింది. బిట్ కాయిన్ తాజా పెరుగుదలతో రెండు నెలల గరిష్టానికి చేరుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఇది 5 శాతం లాభపడింది. ఈ వారంలోనే బిట్ కాయిన్ 25 శాతం వరకు లాభపడింది.
క్రిప్టో కరెన్సీ పైన పలు దేశాల్లో ఒత్తిడి కొనసాగుతోంది. అయితే ఈ ప్రభావం క్రిప్టో పైన కనిపించలేదు. ముఖ్యంగా మలేషియాలో బినాన్స్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ పైన ఒత్తిడి పెరిగింది. ఇన్వెస్టర్లు మనీ డబ్బులు తీయాలని సూచిస్తున్నారు. ఓ వైపు క్రిప్టో పైన ఒత్తిడి కనిపిస్తున్నప్పటికీ పైకి జంప్ చేస్తున్నాయి. క్రితం సెషన్లో క్రిప్టో ధరలు ఇలా ఉన్నాయి...

Bitcoin - $41,000.09 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 0.60 ఎగిసింది.
Ethereum- $2426.73 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 5.77 శాతం ఎగిసింది.
Binance Coin - $321.62 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 2.66 శాతం ఎగిసింది.
Cardano - $1.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 1.92 శాతం ఎగిసింది.
Dogecoin - $0.2084 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 2.11 శాతం ఎగిసింది.
XRP - $0.7518 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 6.26 శాతం ఎగిసింది.
Polkadot - $15.38 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 6.21 శాతం లాభపడింది.
Bitcoin Cash - $539.71 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 6.45 శాతం లాభపడింది.
Solana - $32.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 16.84 శాతం ఎగిసింది.
Litecoin - $142.54 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల్లో 3.01 శాతం ఎగిసిపడింది.


Click it and Unblock the Notifications