క్రిప్టో కరెన్సీ పరుగులు పెడుతోంది. గతవారం చివరి వరకు నష్టాల్లో ఉండటంతో పాటు దాదాపు 40,000కు దిగువనే ఉన్న క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 44,000 దిశగా వెళ్తోంది. ఓ సమయంలో 36,000 డాలర్ల స్థాయికి చేరుకుంది. అంటే ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లతో పోలిస్తే దాదాపు సగం. కానీ క్రితం సెషన్ నుండి పైపైకి చేరుకుంటోంది. మొన్నటి సెషన్‌లోనే బిట్ కాయిన్ 40వేల డాలర్ల మార్కును దాటింది. అదే రోజు ఒక్కసారిగా 37,000 నుండి 40వేలకు చేరుకుంది. ఆ తర్వాత నుండి దూకుడు కొనసాగుతూనే ఉంది. 2022లో బిట్ కాయిన్ 9 శాతం నష్టపోగా, ఆల్ టైమ్ గరిష్టంతో మరో 39 శాతం దూరంగా ఉంది.
బిట్ కాయిన్ 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు, గరిష్టం 68,990.90 డాలర్లు. గత 24 గంటల్లో ఈ డిజిటల్ కాయిన్ అందుకున్న గరిష్టం 43,966.68 కాగా, కనిష్టం 41,470 డాలర్లు. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 5.26 శాతం ఎగబాకి 43,884.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఇతర క్రిప్టోల విషయానికి వస్తే ఎథేరియం 4.25 శాతం లాభపడి 3130 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 17.18 శాతం ఎగిసి 0.7835.07 డాలర్లు, సోలానా 6.06 శాతం లాభపడి 120.06 డాలర్లు, టెర్రా 7.22 శాతం ఎగిసి 57.95 డాలర్లు, కార్డానో 6.72 శాతం ఎగిసి 1.20 డాలర్లు, పోల్కాడాట్ 6.58 శాతం లాభపడి 22.48 డాలర్లు, స్టెల్లార్ 8.14 శాతం ఎగిసి 0.235800 డాలర్లు, డోజీకాయిన్ 10.62 శాతం క్షీణించి 0.162339 డాలర్లు, షిబా ఇను 52.20 శాతం ఎగిసి 0.000035 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications