మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి ఈ వస్తువులను కొన్నారా.. జాగ్రత్త.. వీటి పై భారీ జరిమానా, కేసులు..

మన దేశంలో సెకండ్ కాపీ వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సెకండ్ కాపీ వస్తువులు అచ్చం ఒరిజినల్ బ్రాండ్ ఉత్పత్తులలాగానే ఉంటాయి. అంతేకాదు కొందరు వీటిని అసలైన ఒరిజినల్ ప్రొడక్ట్స్ అని చెప్పి దోచుకుంటుంటారు కూడా. ఈ కామర్స్ సైట్స్ వచ్చాక షాపులకి వెళ్లి చూసి కొనడం తగ్గిపోయింది. ఏదైనా ఇలా చిటికేలో ఆర్డర్ చేసేయొచ్చు. అయితే వాటిని నేరుగా చూసి కొనడానికి వీలుండదు. ఇలాంటి ఈకామర్స్ సైట్స్ లో నకిలిల అటకట్టించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పెద్ద ఈ-కామర్స్ కంపెనీల వేర్ హౌసెస్ పై దాడులు చేసింది.

bis raids on ecommerce companies in Lucknow Gurugram and Delhi large amount of counterfeit goods found and recovered

లక్నో, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లోని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వేర్ హౌసెస్ పై ఈ దాడులు జరిగాయి. ఈ సమాచారాన్ని BIS ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం, 7 మార్చి 2025న లక్నోలో అమెజాన్ గిడ్డంగిపై దాడి జరిగింది. ఇక్కడి నుండి 215 బొమ్మలు, 24 హ్యాండ్ బ్లెండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉత్పత్తులన్నింటికీ అవసరమైన BIS సర్టిఫికేషన్ లేదు. ఫిబ్రవరి 2025లో గురుగ్రామ్‌లోని కంపెనీ వేర్ హౌస్ నుండి మరికొన్ని ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 58 అల్యూమినియం ఫాయిల్స్, 34 మెటాలిక్ వాటర్ బాటిళ్లు, 25 బొమ్మలు, 20 హ్యాండ్ బ్లెండర్లు, 7 పివిసి కేబుల్స్, 2 ఫుడ్ మిక్సర్లు ఇంకా 1 స్పీకర్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానికి కూడా BIS సర్టిఫికేట్ లేదు.

గురుగ్రామ్‌లోని ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగిపై కూడా ఈ రైడ్ జరిగింది. ఈ గిడ్డంగిని ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఇక్కడి నుండి 534 స్టీల్ బాటిళ్లు (వాక్యూమ్ ఇన్సులేటెడ్), 134 బొమ్మలు, 41 స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ సర్టిఫైడ్ లేకుండా ఉన్నాయి. అమెజాన్ ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లలో లభించే చాల నకిలీ ఉత్పత్తులు టెక్విజన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వస్తున్నాయని BIS దర్యాప్తులో తేలింది.

నకిలీ వస్తువులు: ఢిల్లీలోని టెక్విజన్ ఇంటర్నేషనల్ రెండు ప్రదేశాలలో దాడులు నిర్వహించినట్లు BIS తెలిపింది. ఇక్కడి నుండి దాదాపు 7,000 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4,000 ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కూడా దేనికీ BIS సర్టిఫికేషన్ లేదు. స్వాధీనం చేసుకున్న సర్టిఫికేషన్ లేని ఉత్పత్తులలో డిజిస్మార్ట్, యాక్టివా, ఇనల్సా, సెల్లో స్విఫ్ట్, బటర్‌ఫ్లై వంటి బ్రాండ్లు ఉన్నాయి. వస్తువులను స్వాధీనం చేసుకున్న తర్వాత BIS చట్టం, 2016 ప్రకారం బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. BIS చట్టం, 2016లోని సెక్షన్లు 17(1) అండ్ 17(3)లను ఉల్లంఘించినందుకు BIS, M/s Techvision International Pvt Ltd పై రెండు కేసులు నమోదు చేసింది. ఇతర దాడులపై కూడా కేసులు నమోదు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. BIS చట్టం, 2016లోని సెక్షన్ 17 ప్రకారం నేరస్థులు కనీసం రూ. 2 లక్షల జరిమానాను ఎదుర్కోవచ్చు. ఈ జరిమానా అమ్మిన లేదా అమ్మకానికి ఉంచిన వస్తువుల ధరకు పది రెట్లు వరకు ఉంటుంది.

Take a Poll

శిక్ష ఎంత ఉంటుంది: ఉల్లంఘన తీవ్రతను బట్టి, నిందితులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడవచ్చని ప్రకటన పేర్కొంది. అంటే ఏదైనా కంపెనీ BIS సర్టిఫికేషన్ లేకుండా వస్తువులను అమ్మితే దానికి భారీ జరిమానాలు ఇంకా జైలు శిక్ష కూడా పడవచ్చు. BIS ఇలాంటి కేసులను నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటోంది. అలాగే వినియోగదారులకు సురక్షితమైన & ప్రామాణికమైన ఉత్పత్తులను అందిస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+