Multibagger Stock: అప్పులు లేని కంపెనీలు అందులోనూ మల్టీబ్యాగర్ రాబడులను అందించేవి చాలా అరుదు. పైగా ఇలాంటి వాటికి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన ఉంటుంది. ప్రస్తుతం అలాంటి స్టాక్ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను కూడా అందిస్తోంది. మీరూ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ఉండవచ్చు.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ అయిన బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ గురించే. మిడ్ క్యాప్ కంపెనీగా గుర్తింపు పొందిన సంస్థ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.9,465.58 కోట్లుగా ఉంది. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం కంపెనీకి ఎలాంటి రుణం లేదు. పైగా ఈ స్టాక్ తన ఇన్వెస్టర్లకు చాలా కాలంగా మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.

మల్టీబ్యాగర్ రాబడి..
ఈ కాలంలో స్టాక్ ఇన్వెస్టర్లకు 25,127.61 శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. ఒక ఇన్వెస్టర్ కంపెనీ ప్రారంభ దశ నుంచి ఈ స్టాక్‌పై రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. అప్పట్లో అతనికి 74,626 షేర్లు వచ్చేవి.

బోనస్ షేర్లు..
జనవరి 4, 2007న కంపెనీ 1:1 నిష్పత్తితో బోనస్‌ను జారీ చేసింది. దీని తర్వాత ఇన్వెస్టర్ల షేర్ల సంఖ్య 1,49,252 షేర్లకు చేరుకుంది. ఇది షేరు ధర, వాల్యూమ్ రెండింటినీ పెంచింది. మళ్లీ 2012లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయడంతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు లాభపడ్డారు. అలా అప్పట్లో లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి బోనస్ తీసుకున్న తర్వాత 2,98,504 షేర్లు వస్తాయి. వీటి ఈ రోజు మార్కెట్ విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంది.

గడచిన 5 ఏళ్లలో..
ఈ స్టాక్ గత 5 సంవత్సరాల్లో ఇన్వెస్టర్లకు 421.60 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. కానీ ఏడాది కాలంగా స్టాక్ 17.29 శాతం పడిపోయింది. 2022లో స్టాక్ ఇప్పటి వరకు 40.43 శాతం పడిపోయింది. ఉదయం 11.13 గంటలకు షేర్ రూ.336 వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.585.85గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.306.15గా ఉంది. జనవరి 12, 2001న షేరు ధర కేవలం రూ.1.34 మాత్రమే. 20 ఏళ్లలో ఇన్వెస్టర్లు మంచి లాభాలను ఆర్జించారు.


Click it and Unblock the Notifications