భవననిర్మాణ సామగ్రి రంగంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు బిర్లాను గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ప్రకటించింది. నిర్మాణ, మౌలికరంగ సదుపాయాలు, ఇంటీరియర్ సొల్యూషన్స్ వంటి విభాగాల్లో వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ కొత్తగా ఫైబర్ సిమెంట్ బోర్డ్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త యూనిట్ బిర్లాను నిర్మాణ సామగ్రి పోర్ట్‌ఫోలియోలో కీలకమైన విస్తరణగా భావిస్తున్నారు.
బిర్లాను మేనేజింగ్ డైరెక్టర్, CEO అక్షత్ సేథ్ ప్రకటనలో.. నెల్లూరు ప్రాజెక్ట్ కంపెనీ వృద్ధి వ్యూహంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. మొదటి దశలో రూ.127 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నిర్మించబనున్నారు. నిర్మాణం పూర్తయ్యే సరికి దాదాపు 600 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఈ ప్లాంట్ భారత్‌లోని దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఫైబర్ సిమెంట్ బోర్డులను సరఫరా చేయనుంది. పెరుగుతున్న నిర్మాణ, హౌసింగ్ రంగాలకు మరింత నాణ్యమైన, ఖర్చు-సౌకర్యవంతమైన సామగ్రి అందుబాటులోకి రావడానికి ఈ యూనిట్ తోడ్పాటును అందిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

నెల్లూరులో నిర్మించనున్న ఈ సౌకర్యం అత్యాధునిక తయారీ సాంకేతికతలు, కొత్త తరం ఫ్లో-లైన్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ ప్రక్రియలు వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించనుంది. ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే.. అది ప్రధానంగా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి వచ్చే ఫ్లై యాష్‌ను కీలక ముడి పదార్థంగా ఉపయోగించనుంది. ఫ్లై యాష్ వినియోగం ద్వారా పారిశ్రామిక వ్యర్థాల తగ్గింపుతో పాటు, పర్యావరణ పరిరక్షణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (Circular Economy) వంటి లక్ష్యాలకు మద్దతు ఇవ్వనుంది. నెల్లూరు పారిశ్రామిక మండలంలో మెటీరియల్ సోర్సింగ్, లాజిస్టిక్స్ మరింత సమర్థవంతంగా ఉండటంతో, ఖర్చులను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.
ఇదే కాకుండా, BirlaNu ఈ యూనిట్ ద్వారా దేశవ్యాప్తంగా తన బిల్డింగ్ మెటీరియల సరఫరా గొలుసును స్థిరీకరించాలనుకుంటోంది. పెద్ద ఎత్తున ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ నిర్మాణ సామగ్రి రంగంలో బిర్లాను పోటీశక్తిని గణనీయంగా పెంచనుంది. కంపెనీ ప్రణాళికలు ఇక్కడితో ఆగడం లేదు. రెండో దశలో నెల్లూరు సైట్‌ను విస్తరించి ఇక్కడ PVC పైపులు, ఫిట్టింగ్‌లు, నిర్మాణ రసాయనాలు వంటి అదనపు తయారీ యూనిట్లను కూడా ఏర్పాటుచేయాలన్న ప్రణాళిక ఉంది.
ఇది నెల్లూరు యూనిట్‌ను ఒక్కచోటే విభిన్న భవన నిర్మాణ సామగ్రి సిద్ధం చేసే పెద్ద ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చనుంది. ఈ విధమైన హబ్ కంపెనీకి మార్కెట్ మార్పులకు త్వరగా స్పందించే అవకాశం ఇస్తుంది. అలాగే ఆపరేషన్లను ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం ద్వారా ఖర్చులను తగ్గించి లాభదాయకతను పెంచే అవకాశం ఉంది.
పెరుగుతున్న పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, స్థానిక సరఫరాదారులకు కొత్త అవకాశాలు లభించడం వంటి అంశాలు నెల్లూరు జిల్లాకు భారీ ప్రయోజనాన్ని అందించనున్నాయి. బిర్లాను చేపడుతున్న ఈ బహుళ-దశల ప్రాజెక్ట్ కంపెనీ దేశవ్యాప్తంగా తన తయారీ పాదముద్రను విస్తరించడమే కాకుండా, నిర్మాణ సామగ్రి రంగంలో దీర్ఘకాలికంగా బలమైన స్థానం సంపాదించాలన్న సంకల్పాన్ని కూడా స్పష్టం చేస్తోంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications