Hindalco: ఇన్వెస్టర్లను నిరాశపరిచిన బిర్లా కంపెనీ.. ఊహించిందే జరిగిందా..?
Hindalco: దేశీయ ప్రఖ్యాత వ్యాపారి సమ్మేళనం ఆదిత్య బిర్లాకు చెందిన హిందాల్కొ ఇండస్ట్రీస్ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల చేసింది. మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లుగానే కంపెనీ ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ క్రమంలో మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.2,411 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.3,851 కోట్లుగా ఉంది. అమ్మకాలు నిలిచిపోవటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కార్యకలాపాల ద్వారా క్యూ-4లో ఆదాయం రూ.55,857 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే ఇది 0.16 శాతం అధికం.

కంపెనీ అమెరికా ఆధారిత అనుబంధ సంస్థ వ్యాపార అస్థిరతలు ఉన్నప్పటికీ మెరుగైన ఉత్పత్తి ధర, అనుకూలమైన ఉత్పత్తి మిశ్రమం కారణంగా నోవెలిస్ క్వార్టర్-ఆన్-క్వార్టర్ రికవరీని చూపిందని హిండాల్కో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పాయ్ అన్నారు. నోవెలిస్ నాలుగో త్రైమాసిక ఆదాయం 4.4 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశంలో వ్యాపారాన్ని రుణ రహితంగా మార్చటం వల్ల రానున్న కాలంలో వృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
బిర్లాలకు చెందిన ఈ కంపెనీ దేశీయంగా అల్యూమినియం ఉత్పత్తిలో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. అలాగే ప్రపంచంలో ఫ్లాట్ రోల్ ఉత్పత్తులు, అల్యూమినియం రీసైక్లింగ్ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో షేర్ ధర స్వల్పంగా తగ్గి రూ.406.95 వద్ద ఉంది. కంపెనీ తన షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.3 డివిడెండ్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications