Bitcoin: బంగారం కంటే భారీగా పెరగనున్న బిట్ కాయిన్..!
అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారం, బిట్ కాయిన్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బిట్ కాయిన్ పై క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో బిట్‌కాయిన్ భవిష్యత్తుపై బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో బిట్‌కాయిన్ విలువ భవిష్యత్తులో 1 మిలియన్ డాలర్లకు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.9.5 కోట్లు చేరడం ఖాయమని అన్నారు. ఇందుకు 25 ఏళ్లు పట్టకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన బిట్‌కాయిన్ ఆసియా 2026 సదస్సులో 'బిట్‌కాయిన్ శతాబ్ధి' పేరుతో జరిగిన చర్చలో చాంగ్‌పెంగ్ జావో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.
అయితే బిట్‌కాయిన్‌ను కేవలం ధర ఆధారంగా అంచనా వేయడం సరికాదని చాంగ్‌పెంగ్ జావో వివరించారు. రాబోయే దశాబ్దంలో దాని వినియోగం, చెల్లింపుల్లో వినియోగం, సంస్థాగత స్వీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పెద్ద ఎత్తున బిట్‌కాయిన్ చెల్లింపులు జరగడం, రిటైర్మెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, పెట్టుబడి నిధులు, ప్రభుత్వాల రిజర్వ్ ఆస్తుల్లో బిట్‌కాయిన్‌కు స్థానం లభించడం వంటి పరిణామాలు కీలక మైలురాళ్లుగా ఉంటాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో బిట్‌కాయిన్ ప్రాధాన్యత బంగారాన్ని మించే అవకాశం ఉందని చాంగ్‌పెంగ్ జావో పేర్కొన్నారు. ముఖ్యంగా తదుపరి బుల్ మార్కెట్‌లో బిట్‌కాయిన్ మార్కెట్ విలువ పరంగా బంగారాన్ని అధిగమించవచ్చని అన్నారు.

అయితే ప్రస్తుతం ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం ఉందని తెలిపారు. ఇటీవలి మార్కెట్ డేటా ప్రకారం బిట్‌కాయిన్ ధర ఆగస్టు చివర్లో దాదాపు 80,000 డాలర్ల వద్ద కొనసాగుతోందని అన్నారు. ఆగస్టు 25న ఇది 80,600 డాలర్లకు చేరిందని.. దీంతో 1 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరాలంటే ప్రస్తుత స్థాయి నుంచి బిట్‌కాయిన్ దాదాపు 12 రెట్లు పెరగాలని పేర్కొన్నారు. క్రిప్టో రంగంలో వచ్చే పదేళ్లలో కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా స్టేబుల్‌కాయిన్లు, టోకెనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), AI ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని చాంగ్‌పెంగ్ జావో తెలిపారు. టోకెనైజ్డ్ ఆస్తులు, డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరించడంతో సంప్రదాయ ఆర్థిక వ్యవస్థతో క్రిప్టో రంగం మరింత బలపడుతుందని అన్నారు.
బిట్‌కాయిన్ ప్రధానంగా దీర్ఘకాలిక పొదుపు, రిజర్వ్ ఆస్తిగా ఎదగవచ్చని అంచనా వేశారు. బిట్ కాయిన్ బంగారం కంటే ఎక్కువ రాబడి ఇచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు స్టేబుల్‌కాయిన్లు రోజువారీ చెల్లింపులు, ట్రేడింగ్, అలాగే AI ఏజెంట్ల మధ్య జరిగే మెషిన్-టు-మెషిన్ లావాదేవీల్లో కీలకంగా మారవచ్చని చాంగ్‌పెంగ్ జావో అంచనా వేశారు. ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి కూడా బిట్ కాయిన్ పై బుల్లిష్ గా ఉన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications