Warren Buffett: అమెరికా బ్యాంకింగ్ రంగంపై వారెన్ బఫెట్ అప్రమత్తం.. ఏమన్నారంటే..?
Warren Buffett: పెట్టుబడుల రంగంలో వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే ప్రపంచ ప్రఖ్యాత గాంచింది. అయితే ప్రస్తుతం అమెరికా మార్కెట్లలో బ్యాంకింగ్ సంక్షోభం ముదురుతున్న తరుణంలో బఫెట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా తర్వాత అదే దారిలో మరిన్ని బ్యాంకులు క్యూ కడుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి బెర్క్‌షైర్ హాత్వే చాలా జాగ్రత్తగా ఉన్నట్లు బఫెట్ తెలిపారు. బ్యాంకులు కుప్పకూలుతున్న తరుణంలో డిపాజిట్లపై ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్ పరిమితిని 2,50,000 డాలర్లకు పెంచాలని కోరారు.

ఈ క్రమంలో పెరుగుతున్న భయాల కారణంగా చాలా మంది ప్రజలు బ్యాంకుల్లో తమ డబ్బును వెనక్కి తీసుకోవటానికి క్యూ కట్టారని బఫెట్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో అస్థిరతల కారణంగా ఈ సారి రాబడులు తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం బెర్క్‌షైర్ సుమారు 128 బిలియన్ డాలర్ల నగదు, ట్రెజరీ బిల్లులను కలిగి ఉందని బఫెట్ చెప్పారు.
విఫలమైన తాజా ప్రాంతీయ US బ్యాంక్ అయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో నిర్ణీత రేట్ల వద్ద హామీ లేని జంబో-సైజ్ తనఖాలను అందిస్తున్నట్లు వెల్లడించింది. 1931లో బ్యాంక్ రన్ కారణంగా తన తండ్రి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని బఫెట్ వెల్లడించారు. ఈ క్రమంలో ఇటీవల కుప్పకూలిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ను జేపీ మోర్గాన్ కొనుగోలు చేసింది.
వారెన్ బఫెట్ పెట్టుబడుల సంస్థ బెర్క్‌షైర్ కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు కొన్ని బ్యాంకింగ్ కంపెనీల్లో పెట్టుబడులను అన్‌లోడ్ చేసింది. గత ఆరు నెలల్లో కొన్ని బ్యాంక్ స్టాక్‌లను కూడా విక్రయించింది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్లను మాత్రమే కలిగి ఉంది. సంక్షోభానికి ముందే ఈ రంగంలో పెట్టుబడులను ఉపసంహకరించుకోవటంతో తాము సంతోషంగా ఉన్నానని ప్రపంచ కుబేరుడు బఫెట్ చెప్పారు.


Click it and Unblock the Notifications